చైనాకు చేసిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ జనవరి 6న భారతదేశంలో రియల్‌మీ 16 ప్రో 5G సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ ప్యాడ్ 3 5Gని కూడా విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 16 ప్రో 5G ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ‘అర్బన్ వైల్డ్’ డిజైన్ ఫోన్‌కు ప్రీమియం అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగులలో (మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే) అందుబాటులో ఉంటుంది. రియల్‌మీ 16 ప్రో ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ప్రైస్, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
రియల్‌మీ 16 ప్రో 5Gకి సంబంధించిన ప్రముఖ టెక్ బ్లాగర్ పరాస్ గుగ్లానీ కొన్ని డీటెయిల్స్ పంచుకున్నారు. ఈ ఫోన్ మూడు వేర్వేరు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో రానుంది. 8GB+128GB బేస్ వేరియంట్ ధర రూ.31,999గా.. 8GB+256GB వేరియంట్ ధర రూ.33,999గా ఉండే అవకాశాలు ఉన్నాయి.12GB+256GB టాప్ వేరియంట్ ధర రూ.36,999 ఉండనుంది. ఈ ఫోన్ మిడ్-బడ్జెట్ కస్టమర్లకు, ముఖ్యంగా డిజైన్, కెమెరా రెండింటికీ ప్రాధాన్యతనిచ్చే వారికి మంచి ఎంపిక. ప్రో ప్లస్ ధర ఎక్కువగా ఉండనుంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.39,999గా.. 8GB+256GB వేరియంట్ ధర రూ.41,999గా.. 12GB+256GB వేరియంట్ ధర రూ.44,999కి లాంచ్ కానుంది.
Also Read: Pooja Hegde: సక్సెస్ టేస్ట్ మర్చిపోయిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మను ఆదుకోవాల్సింది ఆ హీరోయేనా?
రియల్‌మీ 16 ప్రో సిరీస్ లుక్స్ పరంగానే కాకుండా హార్డ్‌వేర్ పరంగా కూడా శక్తివంతమైనదిగా ఉంటుందని భావిస్తున్నారు. ఈసారి కంపెనీ బ్యాటరీ, కెమెరాపై దృష్టి పెట్టింది. ఈ ఫోన్‌లు 7,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉండనున్నాయి. ఇది రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందించనుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వినియోగదారులకు ఇది మంచి ఎంపిక. 200-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ మాస్టర్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మెరుగైన కలర్ ప్రాసెసింగ్ కోసం LumaColor ఇమేజ్ టెక్నాలజీ ఉంటుంది. రియల్‌మీ 16 ప్రో+లో తాజా స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉండనుంది. రియల్‌మీ 16 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 7300-మ్యాక్స్ ప్రాసెసర్‌తో రానుంది. మీరు 30-45 వేల బడ్జెట్‌లో గొప్ప కెమెరా, అద్భుతమైన డిజైన్, బిగ్ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ సిరీస్ మీకు మంచి ఎంపిక కావచ్చు.