NTV WebDesk
Author- NTV Telugu-
5 నిమిషాల్లో 2 వేల కోట్ల విలువైన సెల్పోన్లు అమ్మకం…
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ 12 సీరిస్‌ను డిసెంబర్ 28 వ తేదీన రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను రిలీజ్ చేసిన 5 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1.8 బిలియన్ యునాన్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2108 కోట్లు విలువైన షావోమీ 12 సీరిస్ మొబైల్ అమ్మకాలు జరిగాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ […] -
2022, జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా ఎంతో తెలుసా?
ప్రపంచంలో నాలుగింట మూడొంతులు నీళ్లతో నిండిపోగా, ఒక వంతు మాత్రమే భూమి ఉన్నది. ఈ ఒక వంతు భూమిపై ప్రస్తుతం ఎంతమంది నివశిస్తున్నారు, సెకనుకు ఎంత మంది పుడుతున్నారు, ఎంత మంది మరణిస్తున్నారు అనే విషయాలను అమెరికాకు చెందిన సెన్సెస్ బ్యూరో ఓ నివేదిను తయారు చేసింది. 2021 లో ప్రపంచ జనాభా భారీగా పెరిగినట్టు అంచనా వేసింది. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. 2021 […] -
ప్రతి ఇంటా సంతోషం,చిరునవ్వులు విరియాలంటూ చంద్రబాబు విషెస్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ఆనందోత్సాహాలతో గడవాలని కోరుకున్నారు. ప్రతి ఇంటా సంతోషం, చిరునవ్వులు విరియాలని ఆయన ఆకాంక్షించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. Read Also:న్యూ ఇయర్ విషెస్ తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. 2022 ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న […] -
వేడుకలు వద్దు ఆరోగ్యాన్ని కాపాడుకోండి: మంత్రి జగదీశ్‌రెడ్డి
తెలంగాణ ప్రజలకు మంత్రి జగదీశ్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు అందరూ దూరంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉంటే ఏడాదంతా వేడుకలు చేసుకోవచ్చని తెలిపారు. ఒమిక్రాన్ వేరింయంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని మంత్రి ప్రజలను కోరారు. Read Also:చాదర్‌ఘాట్‌లో ఘోర అగ్ని ప్రమాదం ఆరోగ్యాలను కాపాడుకోవడానికి అందరూ ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ప్రాణాలు విలువైనవని అందుకే వేడుకల పేరుతో ఎవ్వరు ప్రాణాల […] -
భారత్ భూభాగంలోని ప్రాంతాలకు చైనా పేర్లు…
చైనా మరోసారి కుటిలబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే చైనా పేర్లను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. అయితే, చైనా దానికి ససేమిరా అంటోంది. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగస్వామ్యమని, దక్షిణ టిబెట్‌గా తాము పిలుస్తామని, తమ భూభాగంలోని ప్రదేశాలకు పేర్లు పెట్టుకుంటామని, తన సార్వభౌమత్వానికి ఎవరూ అడ్డు వచ్చినా ఊరుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. ఆరుణాచల్ ప్రదేశ్‌లోని 15 భూభాగాలకు చైనా పేర్లు […] -
చాదర్‌ఘాట్‌లో ఘోర అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా… 40 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పుట్ పాత్… దగ్గర వేసుకుని.. ఉన్న గుడిసెల్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం ధాటికి గుడిసెల్లో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి.దీంతో అగ్ని ప్రమాదం తీవ్రత పెరిగి పక్కపక్కనే ఉన్న 40 గుడిసెలు దగ్ధం అయ్యాయి. Read Also:దేశ తలసరి […] -
దేశ తలసరి ఆదాయం కన్నా.. రాష్ర్ట ఆదాయం పెరిగింది: మంత్రి ఎర్రబెల్లి
సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం 1లక్ష829 రూపాయలు మాత్రమే నమోదయిందని కానీ 2020-21 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 1లక్ష 24వేల 104 రూపాయాల తలసరి ఆదాయం, 2020-21 నాటికి 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని మంత్రి అన్నారు. Read Also: నాలుగో రోజు 6లక్షలకు పైగా ఖాతాల్లో […] -
ఈ లక్షణాలుంటే వెంటనే టెస్ట్ చేయించుకోండి…లేదంటే…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని చెప్పాలి. రోజువారి కేసుల్లో భారీ పెరుగుదలలు కనిపిస్తున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా క్రమంగా పెరుగుతున్నది. అనేక దేశాల్లో పరిస్థితి భారత్ కంటే మరింత దారుణంగా మారింది. యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నా కోవడ్, ఒమిక్రాన్ సోకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, బాడీపెయిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం […] -
నాలుగో రోజు 6లక్షలకు పైగా ఖాతాల్లో రైతుబంధు
తెలంగాణలో నాలుగో రోజు 6 లక్షల 75 వేల 824 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1144.64 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. దీంతో కలిపి ఇప్పటి వరకు 52 లక్షల 71 వేల 91 మంది రైతులకు రైతుబంధు నిధులు అందింది. మొత్తం పెట్టుబడి సాయం రూ. 4246.68 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. సంప్రదాయ సాగు నుంచి రైతులు బయటకు రావాలని సూచించారు. […] -
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం…ముంబైలో 47 శాతం పెరిగిన కేసులు
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 8,067 కేసులు నమోదయ్యాయి. భారీ స్థాయిలో కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక ముంబై నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ముంబై నగరంలో కొత్తగా 5428 కేసులు నమోదయ్యాయి. రోజువారి కేసుల్లో పెరుగుదల 47 శాతం అధికంగా ఉన్నది. కరోనా కేసులతో పాటుగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. త్వరలోనే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాను డామినెట్ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read: […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!