ఇళ్ళ మధ్యలో పబ్ లు, బార్లు ఏర్పాటు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం ఈ పిటీషన్ హైకోర్టు విచారించింది. జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ ఏరియాలో పబ్‌లు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన జూబ్లీహిల్స్ లోని రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు. తదుపరి విచారణ ఈనెల 22కు హైకోర్టు వాయిదా వేసింది. Read Also: ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: కేటీఆర్ […]
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 100 కోట్లకు పైగా జనాభా ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అంత సులువు కాదని స్పష్టం చేశారు. ఉపాధి కల్పించే కొత్త సంస్థలకు స్టార్టప్‌లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఏ దేశంలోనైనా ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగానే ఉంటాయని, నైపుణ్యం ఉంటే ఉద్యోగవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. Read Also: ఇంట్లో కూడా మాస్కు ధరించాల్సిందే: తెలంగాణ […]
పాకిస్థాన్ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేసింది. అయితే దాన్ని మళ్లీ పునర్ నిర్మించారు. ఇవాళ ఆలయాన్ని భారత రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ మళ్లీ ప్రారంభించారు. విక్టరీ డే సెలబ్రేషన్స్ కోసం బంగ్లాలో రామ్‌నాథ్ మూడు రోజుల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 1971 యుద్ధం సమయంలో పాకిస్థాన్ ఆర్మీ సుమారు 250 మంది హిందువులను అత్యంత కిరాతకంగా హతమార్చింది. Also Read: ప్రధాని మోదీ ఖాతాలో మరో […]
రైతులను వదిలేసే ప్రభుత్వం తమది కాదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. శుక్రవారం గుంటూరులోని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటిలోని అగ్రిటెక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రాప్ ద్వారా నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చిపంటపై నివేదిక తెప్పిస్తామన్నారు. Read Also: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఎన్జీటీ కీలక తీర్పు వ్యవసాయ, ఉద్యానశాఖ వీసీలతో పాటు సైంటిస్టులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నల్ల […]
అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని జాతీయ హరిత ట్రిబ్యూనల్ (NGT) తీర్పునిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి నిపుణులతో కమిటీ వేయాలని ప్రతిపాదించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టొద్దని సూచించింది. Also Read: ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే జగన్ నాశనం చేస్తున్నాడు: నిమ్మల రామనాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం పై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయాలని, ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని […]
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండి అటు అమరావతి, ఇటు పోలవరంకు వెళ్లనీయకుండా పశ్చిమ గోదావరిలోని టీడీపీ నేతలను ఎక్కడిక్కడ పోలీసులు గృహనిర్భంధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దీంతో టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ… ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం గా ఏపీని నాడు చంద్రబాబు అభివృద్ధి […]
ఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇళ్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. Also Read: లాభాల్లో ఉన్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే: గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరుపేదలకు ఇండ్లు […]
రూ.16 లక్షల కోట్ల లాభాల్లో వున్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దుర్మార్గపు విధానాలతో దేశాన్ని అంబానీలకు, ఆదానిలకు అమ్ముతున్నాదని దుయ్యబట్టారు. జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే విధానాలను బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ […]
రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తున్నాయి. ఆ పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకి ప్రతి ఏటా రూ.6 వేలు బ్యాంక్ అకౌంట్లలో జమవుతూ వస్తాయి. దీనితో ఆర్థికంగా రైతులకు భరోసా కలుగుతుంది. మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తాయి. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లో పడతాయి. ఇప్పటికే 9 విడతల డబ్బులు వచ్చాయి. […]