తెలంగాణలో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వీకర్ సెక్షన్ కాలనీలలో ఆలయాల నిర్మాణానికి రూ. 7.56 కోట్లు కేటాయించామన్నారు. దీనికి సీజీఎఫ్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీయం కేసీఆర్ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని దేవాదాయ వాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం అరణ్య భవన్ లో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమయ్యారు. సర్వశ్రేయో […]
భారత్ కు చెందిన విప్రో కంపెనీ అమెరికాకు చెందిన లీన్ స్విఫ్ట్ సోల్యూషన్స్ ను సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు బుధవారం రోజున పూర్తి చేసినట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ బిజినెస్‌ను విస్తరించడానికి విప్రో లీన్ స్విఫ్ట్ సోల్యూషన్స్‌ను కొనుగోలు చేసింది. 2022 మార్చి 31 తో లీన్ స్విఫ్ట్ పూర్తిగా విప్రోలో విలీనం అవుతుంది. యూఎస్, స్వీడన్, భారత్ లో లీన్‌స్విఫ్ట్ కంపెనీ కార్యాలయాలను కలిగి యుంది. పంపిణీ, రసాయనాలు, ఫ్యాషన్, […]
స్టార్స్ ఏం చేసినా అందమే. వారి కోసం అభిమానులు ఏమైనా చేయడానికి సిద్దంగా ఉంటారు. కటౌట్లు కట్టడం దగ్గరి నుంచి కొబ్బరికాయలు కొట్టడం దగ్గరి నుంచి వారు వాడిన వస్తువులను సేకరించడం వరకూ చేస్తుంటారు. అభిమానుల బలహీనతలను కొంతమంది స్టార్స్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. అలాంటి వారిలో పాపులర్ టీవీనటి మాటో కూడా ఒకరు. టీవీషో నటిగా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. సోషల్ మీడియాలో ఈ నటి నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. Read: దేశంలో […]
తెలంగాణలో వరి పంట కొనుగోలుపై మాటల యుద్ధం సాగుతోంది. విపక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీని తూర్పారబెడుతున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో సీఎం కేసీఆర్‌పై ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తన మెడ మీద కేంద్రం కత్తి పెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసిచ్చానని చెప్పిన అసమర్ధ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు మెడ మీద రైతుబంధు కత్తి పెట్టి వరి వేయవద్దంటున్నాడు. రైతుబంధు ఎత్తేసే కుట్రకు ఇది తొలి అడుగు. పారా హుషార్ […]
సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టా గ్రాం సంచలనంగా మారాయి. వాట్సాప్ ద్వారా సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి వేగంగా చేరవేయగలుగుతాం. వాట్సాప్‌లో గ్రూప్‌లు క్రియేట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసే కొన్ని పోస్టులు గ్రూప్ అడ్మిన్లను చిక్కుల్లో పడేస్తుంటాయి. కోర్టుల దాకా వెళ్ళాల్సి వుంటుంది. ఒకవేళ గ్రూప్‌లోంచి సదరు మెసేజ్ డిలీట్ చేయాలంటే సాధ్యంకాదు. దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రమే సదరు మెసేజ్‌ను డిలీట్ చేసే అవకాశం […]
దేశంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త వేరియంట్ టెన్షన్ పట్టుకుంది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాపించే లక్షణాలు ఉండటంతో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 77 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ప్రతిరోజు కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపి రిజల్డ్ వచ్చేసరికి అలస్యం అవుతున్నది. ఈలోగా ఒమిక్రాన్ ఏవైనా ఉంటే అవి సామాజికంగా వ్యాపించడం మొదలుపెడతాయి. ఇది […]
తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతూ వుంటుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు చేస్తూ వుంటారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు తన దృష్టికి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెల సంగారెడ్డి మున్సిపాలిటీకి 15 కోట్ల 30 లక్షలు మంజూరు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు ప్రతి నెల 341 కోట్ల రూపాయల […]
ఇంటర్నెట్ ప్రపంచంలో ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇంట్లో వంటలు వండుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. యూప్ ఒపెన్ చేసి కావాల్సినవి తెప్పించుకొని తింటున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఫుడ్ పాయింట్స్ నుంచి 10 లేదంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వారికి డెలివరీ బాయ్స్ ఫుడ్‌ను డెలివరి చేస్తుంటారు. 248 మైళ్ల దూరంలో ఉండే వారికి ఫుడ్ డెలివరి చేయమంటే చేస్తారా? భూమిపై కాకుండా ఆకాశంలో 248 మైళ్ల దూరంలో ఉన్న వారికి […]
కామారెడ్డి జిల్లా శాంతాపూర్ లో రైతు భూమ్ బోయి మరణంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేసింది. పేకాట శిబిరంపై దాడి చేశారు బిచ్కుంద పోలీసులు. అక్కడే పొలంలో వడ్లకు కాపలా ఉన్న రైతు భూమ్ బోయిని చావ బాదారు పోలీసులు. గత నెల 11న భూమ్ బోయి చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసుల కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు భూమ్ బోయి కుటుంబ సభ్యులు.భూమ్ బోయికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, పోస్టుమార్టం […]
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కరోనా వైరస్‌లోని ఒక వేరియంట్ ఇది. సార్స్ కోవ్ జాతిలో అనేక మ్యూటేషన్ల కారణంగా పుట్టుకొచ్చింది ఈవేరియంట్. ఇందులో 30కి పైగా మ్యూటేషన్లు ఉండటంతో వ్యాధిని వేగంగా వ్యాపింపజేస్తున్నది. ఒమిక్రాన్‌ను నిరోధించాలంటే స్పైక్ ప్రోటీన్లను తొలగించాలి. దీనికోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. Read: కరోనా వ్యాప్తికి ఇదే కారణమా…! ఇక ఇదిలా ఉంటే, […]