భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య వంట సిలిండర్ల ధరను రూ.25.50 తగ్గించాయి. ఈ తాజా సవరణతో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,885కి బదులుగా రూ.1,859కే రానుంది.
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అయింది ఓ మహిళ పరిస్థితి. పిల్లి కరిచిందని ఇంజెక్షను తీసుకునేందుకు ఓ మహిళ తండ్రితో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రానికి వెళితే.. తీరా అక్కడ వ్యాక్సిన్ తీసుకోలేదు సరికదా.. వీధికుక్క కరించింది. ఈ విచిత్ర ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీప విళింజమ్‌లో చోటుచేసుకుంది.
వివాహితులు, అవివాతులునే వివక్ష లేకుండా దేశంలోని మహిళలందరూ 24 వారాల్లో అబార్షన్ చేసుకోవచ్చంటూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తాజాగా మైనర్ బాలికల విషయంలో కొన్ని కీలకాంశాలను స్పష్టం చేసింది.
ఆసియా కప్ టోర్నీ తమ సత్తా చాటేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. శనివారం నుంచి టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్ ఆడనుంది.
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడంటూ వచ్చిన కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కాలేదని స్పష్టం చేశారు.
ఓ పౌరకాన్వాయ్‌పై రష్యా దాడి చేసింది. రష్యా జరిపిన ఈ దాడిలో మొత్తం 30 మంది సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ శుక్రవారం తెలిపింది. దాదాపు 88 మంది గాయపడ్డారు.
సాంకేతికతలో కొత్త శకాన్ని తీసుకురావడంతో పాటు ఇన్నాళ్లుగా మనం వాడుతున్న 4జీ సేవలకు అనేక రెట్ల వేగంతో అత్యంత విశ్వసనీయ కమ్యూనికేషన్ వ్యవస్థను అందించడానికి ప్రయత్నిస్తున్న 5G టెలికాం సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి శుక్రవారం ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
16 ఏళ్ల బాలికపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం ఆమె ప్రైవేట్ చిత్రాలను తీసి బ్లాక్‌మెయిల్ చేశారు.
భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. భార్య అనుపమా చౌహాన్‌తో కలిసి ఆయన ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వచ్చారు.