అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాకేంద్రం వద్ద భారీ పేలుడు సంభవించింది.
గాంధీనగర్-ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కర్ణాటకలోకి అడుగుపెట్టింది. కర్ణాటకలో అడుగుపెట్టిన రాహుల్‌గాంధీకి రాష్ట్ర సరిహద్దులోని గుండ్లుపేట్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి జీవితాలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే వారితో నీచంగా ప్రవర్తించాడు. ఓ పాఠశాలలో బాలికలకు అశ్లీల వీడియో చూపించడంతో పాటు వారిని అనుచితంగా తాకుతూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. నామినేషన్ దాఖలుకు నేడు చివరిరోజు కాగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అధ్యక్ష పోటీలో నిలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఫ్రీగా వస్తే కండోములు కూడా కావాలంటారు అంటూ.. శానిటరీ ప్యాడ్‌లపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మహిళా ఐఏఎస్ అధికారి హర్‍జోత్ కౌర్ చేసిన కామెంట్లు ఆమెను చిక్కుల్లో పడేశాయి.
ముంబైలో అంధేరీ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. 40 ఏళ్ల మోడల్ మృతదేహం గురువారం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.