Supreme Court: అబార్షన్ కోసం వచ్చే మైనర్ల వివరాలు పోలీసులకు చెప్పనక్కర్లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: వివాహితులు, అవివాతులునే వివక్ష లేకుండా దేశంలోని మహిళలందరూ 24 వారాల్లో అబార్షన్ చేసుకోవచ్చంటూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తాజాగా మైనర్ బాలికల విషయంలో కొన్ని కీలకాంశాలను స్పష్టం చేసింది. అబార్షన్ కోసం తమ వద్దకు వచ్చే బాలిక వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనిలేదంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చట్టపరిధిని మైనర్లకూ విస్తరిస్తూ వారు కూడా 24 వారాల్లోపు అబార్షన్ చేసుకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా అందుకు అడ్డుగా ఉన్న పోక్సో చట్టంలోని సెక్షన్ నుంచి వైద్యులకు రక్షణ కల్పించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అవాంఛిత గర్భాన్ని తీయించుకునేందుకు బాలికలు ఇకపై న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది.
5G Services Launch: 5జీ సేవలకు నేడే శ్రీకారం.. అధికారికంగా ప్రారంభించనున్న ప్రధాని
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
బాలికల అబార్షన్‌కు అడ్డుగా ఉన్న పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) నుంచి వైద్యులకు రక్షణ కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది. బాలికలు ఎవరైనా అబార్షన్ కోసం తమను ఆశ్రయించినప్పుడు ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని ఈ సెక్షన్ చెబుతుంది. లేదంటే దానిని నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం తీర్పులో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ సెక్షన్ నుంచి వైద్యులకు మినహాయింపిచ్చింది. మైనర్ లేదా మైనర్ సంరక్షకుడి విజ్ఞప్తి మేరకు గర్భవిచ్ఛిత్తి వివరాలను వైద్యులు గోప్యంగా ఉంచవచ్చని పేర్కొంది. అంతేకాదు, ఈ వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనికూడా లేదని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!