5G Services Launch: సాంకేతికతలో కొత్త శకాన్ని తీసుకురావడంతో పాటు ఇన్నాళ్లుగా మనం వాడుతున్న 4జీ సేవలకు అనేక రెట్ల వేగంతో అత్యంత విశ్వసనీయ కమ్యూనికేషన్ వ్యవస్థను అందించడానికి ప్రయత్నిస్తున్న 5G టెలికాం సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. దేశ రాజధానిలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ఉదయం 10 గంటలకు ఆయన 5G సేవలను ప్రారంభించనున్నారు. దేశప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు నేటి నుంచి ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు ‘న్యూ డిజిటల్ యూనివర్స్’ అనే ఇతివృత్తంతో అక్టోబరు 1-4 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే ‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ ఆరో వార్షికోత్సవాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నట్టు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 5జీ సేవలు తొలుత ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభమై, వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.
National Film Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డులు.. ‘ఆకాశమే నీ హద్దురా’కు అవార్డుల పంట
ఈ 5జీ సేవల వల్ల ఏ వీడియోనైనా కొద్ది సెకన్లలోనే డౌన్‌లోడ్ అయ్యే అవకాశం ఉంది. ఫుల్ లెంత్ హై క్వాలిటీ వీడియోలు కూడా చిటికెలో డౌన్‌లోడ్ కానున్నాయి. ఇటీవల వేలం ప్రక్రియ సైతం పూర్తి అయ్యింది. దేశంలోని 3 ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని జియో రూ.88, 078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. అక్టోబర్‌లోనే కొత్త సేవలు రానున్నాయని ఇప్పటికే పలు సంస్థలు వెల్లడించాయి.