Russia Ukraine War: పౌర కాన్వాయ్‌పై రష్యా దాడి.. 30కి చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడు నెలలు దాటినా కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధతీవ్రత తగ్గడం లేదు. ఎటువైపు నుంచి ఏ రాకెట్ వచ్చిపడుతుందో అని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు వణికిపోతున్నాయి. మరోవైపు పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ పై దాడులను మరింతగా పెంచేలా ప్లాన్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ జపోరిజ్జియా ప్రాంతంలో దారుణానికి తెగబడింది రష్యా. ఓ పౌరకాన్వాయ్‌పై రష్యా దాడి చేసింది. రష్యా జరిపిన ఈ దాడిలో మొత్తం 30 మంది సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ శుక్రవారం తెలిపింది. దాదాపు 88 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని జపోరిజ్జియా ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ తెలిపారు. రష్యా దాడులకు తెగబడుతూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన నిందించారు. మరణించిన వారిలో 11 ఏళ్ల బాలిక, 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారని వెల్లడించారు.
మరోవైపు రష్యా ఇప్పటివరకు ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా రష్యాలో విలీనం చేసుకున్నట్లు శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నాలుగు ప్రాంతాలు ఉక్రెయిన్ భూభాగంలో 15శాతం ఉన్నాయి. క్రెమ్లిన్ వేడుకలో సెయింట్ జార్జ్ హాల్‌లో ఉక్రేనియన్ భూభాగాల విలీనాన్ని ప్రకటించిన పుతిన్ సుదీర్ఘ ప్రసంగంలో రష్యాలో నాలుగు కొత్త ప్రాంతాలు చేరాయని అన్నారు. ఉక్రెయిన్ తో ఏడు నెలల యుద్ధంలో ఆ దేశానికి చెందిన తూర్పు భాగాలను రష్యా పాక్షికంగా ఆక్రమించుకుంది. తాజాగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణతో ఉక్రెయిన్ లోని ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో అధికారికంగా విలీనం అయ్యాయి.
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
5G Services Launch: 5జీ సేవలకు నేడే శ్రీకారం.. అధికారికంగా ప్రారంభించనున్న ప్రధాని
మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో పట్టుకోల్పోతున్న రష్యా..మరింతగా దాడులు చేసేందుకు పాక్షిక సైనిక సమీకరణ చేయాలని ఇటీవల డిక్రీ జారీ చేశారు. రాబోయే రోజుల్లో యుద్దంలో 3 లక్షల మంది సైన్యాన్ని సమీకరించేందుకు సిద్ధం అయ్యారు. దీంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కీవ్ వంటి ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఉక్రెయిన్ కు నాటో ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంతో రష్యాకు ఎదురొడ్డి నిలబడుతోంది. దీంతో రష్యా నెమ్మదిగా ఉక్రెయిన్ పై పట్టు కోల్పోతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా పాక్షిక సైనిక సమీకరణ చేయడంతో పాటు అవసరం అనుకుంటే అణుబాంబులు వేసేందుకు సిద్ధంగా ఉందని పుతిన్ నాటో, అమెరికా, వెస్ట్రన్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?