Gas Cylinder Price: భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య వంట సిలిండర్ల ధరను రూ.25.50 తగ్గించాయి. ఈ తాజా సవరణతో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,885కి బదులుగా రూ.1,859కే రానుంది. ఇటీవల కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. చివరగా సెప్టెంబర్ 1న 19కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర రూ.91.50 తగ్గిన విషయం తెలిసిందే. అప్పుడు ధర రూ.1976 నుంచి రూ.1885కి తగ్గింది.
Kerala: అయ్యో ఇట్లయిపాయె.. పిల్లి కరిచిందని ఆస్పత్రికి పోతే.. కుక్క కరిచింది..
ఆగస్టు 1న వాణిజ్య సిలిండర్ ధరలు రూ.36 తగ్గగా.. అంతకు ముందు జులై 6న రూ.8.5 తగ్గించారు. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉండొచ్చని తెలుస్తోంది. జులై 6న, 14.2 కిలోల బరువున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను యూనిట్‌కు రూ.50 పెంచారు. ఇంతకుముందు, దేశీయ సిలిండర్ల ధరలు మే 19, 2022న సవరించబడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం యూనిట్‌కు రూ.1,053గా ఉంది.