Physically Harassed: 16 ఏళ్ల బాలికపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం ఆమె ప్రైవేట్ చిత్రాలను తీసి బ్లాక్‌మెయిల్ చేశారు. రూ.50 వేలు ఇవ్వకపోతే చిత్రాలను బహిరంగపరుస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. నిందితులందరూ 20 ఏళ్లలోపు వారేనని తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు 16 ఏళ్ల బాలిక ప్రైవేట్ చిత్రాలు తమ దగ్గర ఉన్నాయని.. . 50,000 చెల్లించకపోతే చిత్రాలను బహిరంగపరుస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు వెల్లడించారు. ఆమెపై ప్రధాన నిందితుడు సహా ఎనిమిది మంది ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై మైనర్ బాలిక సోదరుడు బుధవారం ఫిర్యాదు చేశాడు.
డిసెంబర్ 31, 2021న సాహిల్‌గా గుర్తించబడిన ప్రధాన నిందితుడు బాలికకు ఫోన్ చేసి ప్రైవేట్ ఫోటోలు తన వద్ద ఉన్నాయని.. తన వద్దకు రాకపోతే బహిరంగపరుస్తానని బెదిరించాడు.ఆ ఎనిమిది మంది వ్యక్తులు ఆమెను లైంగికంగా వేధించి, ఆ చర్యను వీడియో తీశారు. అనంతరం నిందితులు బాధితురాలి నుంచి డబ్బు వసూలు చేయడం ప్రారంభించారు. ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య నిందితులు ఆ బాలిక నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. కానీ అమ్మాయి ఎక్కువ డబ్బు చెల్లించకపోవడంతో నిందితుడు స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో ఆ వీడియోను ప్రసారం చేశారు.
AP High Court On BiggBoss: అశ్లీలతపై ధర్మాసనం సీరియస్
ఈ నేపథ్యంలో బాలిక సోదరుడు పోలీసులను ఆశ్రయించగా.. వారిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఐపీసీ సెక్షన్ 376డీ, పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని, ప్రాథమికంగా, ఆరోపణలు నిజమేనని తెలుస్తోందని కిషన్‌గఢ్ బాస్ సర్కిల్ డీఎస్పీ అతుల్ ఆగ్రా తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.