Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసు.. శివలింగానికి కార్బన్ డేటింగ్‌పై తీర్పు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Case: ఈ ఏడాదిలో ప్రారంభం అయిన జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజూఖానాలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. ఆ తరువాత ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు వారణాసి జిల్లా కోర్టు పరిధిలో ఉంది. ఇదిలా ఉంటే శుక్రవారం జ్ఞానవాపి మసీదుపై వారణాసి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. జ్ఞానవాపీ మసీదు కేసులో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ జరపాలంటూ హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై తీర్పును వారణాసి కోర్టు అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. దీనికి ముందు జ్ఞానవాపి మసీదు-శృంగార్ గౌర్ కేసులో సెప్టెంబర్ 29న ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ వేసింది. వారణాసి జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష్ తీర్పును వెలువరించాల్సి ఉంది.
జ్ఞానవాపి మసీదు వెలుపల ఉన్న హిందూ దేవీదేవతలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో గత నెలలో శాస్త్రీయ దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు అయింది. శివలింగం వయసును నిర్థారించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే కార్బన్ డేటింగ్ నిర్వహించాలని మహిళలు తమ పిటిషన్‌లో కోరారు. ఇదిలా ఉంటే ఐదుగురు మహిళల్లో నలుగురు శాస్త్రీయ అధ్యయనం కోసం కార్బన్ డేటింగ్ కోరగా.. దీని వల్ల శివలింగానికి హాని కలుగవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక.. తొలిరోజు రెండు నామినేషన్లు మాత్రమే..
ఇదిలా ఉంటే ముస్లింపక్షం శాస్త్రీయ విచారణపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. హిందూ మహిళలు చెబుతున్నట్లు జ్ఞానవాపి మసీదుకు ఎలాంటి సంబంధం లేదని.. శివలింగం అని పిలువబడుతున్న ఆకారం ఓ ఫౌంటెన్ అని మసీదు కమిటీ చెబుతోంది. కోర్టు అంతకుముందు విచారణలో కీలక తీర్పు వెల్లడించింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991 ఈ కేసులో వర్తించదని తీర్పు చెప్పింది. ఇది ఆగస్టు15, 1947 కన్నా ముందు నుంచే మనుగడలో ఉండటంతో ఈ చట్టం వర్తించదని వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..