మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. శివసేన గుర్తు అయిన "విల్లు - బాణం"ను ఫ్రీజ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
మహారాష్ట్రలో అక్రమంగా తరలిస్తున్న అరుదైన, అన్యదేశ జీవులను అధికారులు సీజ్ చేశారు. జీవులను అక్రమంగా తరలిస్తు్న్నట్లు సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే రైడ్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆలస్యంగా ఫుడ్‌ను తెచ్చిన డెలివరీ బాయ్‌కు వినూత్న రీతిలో స్వాగతం పలికాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దేశంలో బాల్యవివాహాల విషయంలో కేంద్రం ఓ నివేదిక రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం తక్కువ వయస్సు గల అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్న రాష్ట్రంగా జార్ఖండ్ అపఖ్యాతి పాలైంది.
విద్యార్థులకు ఇచ్చిన హామీని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిలబెట్టుకున్నారు. 10, 12వ తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఉచిత హెలికాప్టర్ రైడ్ అవకాశాన్ని కల్పించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు పూర్తయిందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఏఐసీసీ ఎన్నికల పోటీలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు ఇద్దరే ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవల పశువులను ఢీకొన్న ఘటనలతో వార్తల్లో నిలిచిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది. అప్పుడు రైలు డ్యామేజ్ అయితే తాజాగా రైలు చక్రాల వద్ద సమస్య వచ్చింది. ఇటీవల ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ రైలుకు రోజుకొక కష్టం వచ్చిపడుతోంది
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని వరద రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి శనివారం అస్సాం ప్రజలకు హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను అస్సాంను ఉగ్రవాదం, దాడుల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.