KTR Chit Chat: కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇవ్వొచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్ పలు విషయాలను వెల్లడించారు. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పా్రు. ఈ మాట భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో చెప్పిందని… నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పిందంటూ మంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఇంత అద్భుతమైన పథకాలు రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు, రైతు సమితీలు ఎక్కడా లేవని ఆయన తెలిపారు. ఈ పథకాలతో మన రైతులు పంజాబ్, హర్యానా రైతులతో తెలంగాణ రైతులు పోటీ పడుతున్నారన్నారు. హరిత విప్లవంతో పంజాబ్ , హర్యానా రైతులు దేశానికి అండగా ఉన్నారని.. అలాంటి వారితో మన రైతులు పోటీపడుతున్నారన్నారు.
ఇంటింటికి తాగునీరు ఇవ్వడం పెద్ద విషయమన్నారు. తెలంగాణ సాధన పెద్ద విషయం కాదని ఎలా కొంతమందికి అనిపిస్తుందో అట్లనే అని ఆయన అభిప్రాయపడ్డారు. 75 ఏళ్లలో ఎవరూ చేయని పని తెలంగాణలో కేసీఆర్ చేశారన్నారు. ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రమని పార్లమెంట్‌లో భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 5 దశాబ్దాలుగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యను తాము పరిష్కరించామన్నారు. ఉద్యమ కాలంలో మరిగూడ మండలం ఖుదాభక్ష్ పల్లి అనే ఊరులో ఫ్లోరైడ్ బాదితులను చూస్తే మనసుకు బాధ అనిపిచ్చిందని చెప్పుకొచ్చారు. 8 ఏళ్ల కింద తెలంగాణలో పవర్ సమస్య ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. పార్లమెంట్‌లో భారత ప్రభుత్వం మిషణ్ భగీరథతో తెలంగాణ ఫ్లోరోసిస్ ఫ్రీ అని భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇవన్నీ దేశానికి రోల్ మోడల్ లాంటివన్నారు. కాలియా రైతుబంధు స్పూర్తితో క్రిషిబంధు బెంగాల్ పీఎం కిసాన్ లాంటి పథకాలు రైతుబంధు స్పూర్తితో వివిధ రాష్ర్టాల్లో వచ్చాయన్నారు.
బీజేపీ, ప్రధానిపై నిప్పులు
గోల్ మాల్ గుజరాత్ మోడల్‌ను చూపెట్టి అధికారంలోకి వచ్చి ఈ 8 ఏళ్లలో ఏం చేశారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మోస్ట్ ఇన్ కాంపీటెంట్ , ఇన్ ఎఫిషియంట్, ప్రచార్ మంత్రి స్వతంత్ర భారతంలో మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జన్ కీ బాత్ వినడు.. మన్ కీ బాత్ మాత్రమే చెప్తడు.. బిల్డప్ తప్ప పనేం లేదని ఆయన విమర్శించారు. 45 సంవత్సరాల్లో అత్యధిక నిరుద్యోగం దేశంలో ఉందన్నారు. దేశంలో వికాస్ ఎక్కడ తప్పిపోయిందని ప్రశ్నించారు. అచ్చే దిన్ ఆయేంగే పతా నహీ.. ఒక్క మనిషికే అచ్చే దిన్ అంటూ మండిపడ్డారు. 2022 వరకు అందరికి ఇళ్లు ఇస్తా అన్నడు.. కానీ రూ.435 కోట్లతో ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. ఈ దేశంలో అత్యధిక ద్రోవ్యోల్బణం, అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలో అత్యధిక గ్యాస్ రేట్, నైజీరియా లాగా ఇండియా పేద దేశం అవుతోందని రిపోర్టులు వస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వం ప్రతీ రంగంలో విఫలం అయిందని ఆయన చెప్పారు. భారత్ రాష్ట్ర సమితి రూపంలో ఈ సమస్యలకు తాము పరిష్కారం చూపిస్తామననారు. ప్రతీ ఒక్కరికి తాగునీటిని అందిస్తామని.. ఉచితంగా కరెంటు అందిస్తామని.. దళితులను వ్యాపారవేత్తలను చేస్తామన్నారు. బీజేపీ ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీసిందని ఆయన మండిపడ్డారు. సెప్టెంబర్ 17 ను లిబరేషన్ డే అయితే ఆగష్టు 15 ఎందుకు లిబరేషన్ డే కాదు.. విమోచనం కాదని ప్రశ్నించారు. బ్రిటీష్ వాళ్లు చేసిన అరాచకాలను ఎర్రకోట మీది నుంచి మోడీ ఎందుకు ప్రశ్నించరన్నారు. రాజకీయ భావదారిద్రం కోసం ఆడే చిల్లర నాటకం ఇదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా దండయాత్ర చేసినట్టు ఏక్‌నాథ్ షిండే, బొమ్మై లు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌పై కేటీఆర్
ఈ దేశంలో ప్రతీ ఒక్కరూ సమానమని.. కేసీఆర్ అందుకే పార్టీ పేరును భారతరాష్ట్ర సమితిగా మార్చామని.. అలా పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈసీకి పంపామన్నారు. అదొక రాజ్యాంగబద్ధ సంస్థ అన్నారు. అది తన నిర్ణయాన్ని తీసుకుంటుందని తాము భావిస్తున్నామన్నారు. కేసీఆర్ 8 నెలల నుంచి దేశంలోని వివిధ రాజకీయ నాయకులు, రైతులు, ప్రజాసంఘాలు, ఆర్థిక వేత్తలతో మాట్లాడిన తర్వాతే జాతీయ స్థాయిలోకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. ఇప్పుడే ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికలు తమ టార్గెట్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో చేసిన పని చూసి పంజాబ్‌లో అధికారంలోకి వచ్చారని.. అట్లనే తామూ చేస్తామన్నారు. తమ పని పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తమకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తామన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సర్పంచులు కూడా అడుగుతున్నారని… వీళ్లందరు తెలంగాణ మోడల్ ప్రయోజనాలు చూస్తున్నారన్నారు. తెలంగాణలో కలుపమని కోరుతున్నారని మంత్రి వెల్లడించారు. ఇంపాక్ట్ పక్క రాష్ట్రాల్లో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో పోటీ చేయడం తప్పదన్నారు. కేసీఆర్‌ను అవహేళన చేసినవాళ్లతంతా ఇవాళ చీకట్లో కలిసిపోయారన్నారు.
అధికారం కోసమో పదవుల కోసమో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ దేశంలో ఒక దారుణమైన పరిస్థితి ఉందన్నారు. తమ మీద దాడులు, కుట్రలు ఉంటాయని… వాటన్నింటిని ఎదుర్కుంటున్నామన్నారు. వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటారో తమకూ తెలుసన్నారు. ఈడీ, సీబీఐ లు ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తున్నాయని.. మహారాష్ట్రలో ఎన్సీపీ , శివసేన, కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారని ఆయన తెలిపారు. మోడీ అండ్ కో వ్యూహాలన్నీ తమకు తెలుసన్న కేటీఆర్… వాటన్నింటిని ఎదుర్కుంటామన్నారు. వారి బాగోతాలను మొత్తం బయటపెడతామన్నారు. విలువలు లేని రాజకీయం చేస్తున్న బీజేపీ వలువలు ఇప్పుతామన్నారు. మోడీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారని… వేట కుక్కల లాగా ఈడీ, ఐటీ, సీబీఐలను ఉపయోగించుకుంటారని విమర్శించారు. ఈసీ చెప్పకముందే బీజేపీ వాళ్లు ఎలక్షన్ డేట్‌లు ప్రకటిస్తారు. ఈడీ చెప్పకముందే బీజేపీ లీడర్లు ఈడీ దాడుల గురించి చెపుతారు. ఒక్క బీజేపీ నాయకుడిపై అయినా ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
సుజనాచౌదరీ, సీఎం రమేష్‌లపై కేసులు పెట్టి పార్టీలో చేర్చుకున్నారని ఆయన అన్నారు. కేసులతో భయపెట్టి లొంగదీసుకోవాలనుకుంటే వారి అమాయకత్వమన్నారు. కేసీఆర్ గారికి దమ్ముందన్న ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్‌ను ఎక్స్‌పోజ్ చేయడమే తమ స్ట్రాటజీ అని.. ఏ అంశాలు చర్చకు రావాలో వాటినే పెడతామన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇవే చెబుతామన్నారు. తెలంగాణలో జరుగుతున్న పనిని సమర్థవంతంగా దేశానికి చెపుతామన్నారు. మాకంత నేర్పు, ఓర్పు ఉందన్న ఆయన,.. మేం చేసిన పని చూపెట్టి ఓట్లు అడిగామన్నారు. ఒకటిన్నర సంవత్సరాల్లో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తమని చెప్పడం లేదన్నారు. బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడానికి 40 ఏళ్లు పట్టింది. తమకు అంత టైం పట్టకపోవచ్చన్నారు. అధికారమే పరమావధి కాదని.. తమకు ప్రజలకు ఏం కావాలో అవే అజెండా అన్నారు. సబ్జెక్ట్ ఉన్న తెలుగు సినిమాలు పాన్ ఇండియా అట్లనే తమ పార్టీలో కంటెంట్ కటౌట్ ఉందన్నారు. తమకు విజయం దక్కుతుందన్నారు. రైతుబంధు, దళితబంధు గురించి తెలుసుకుని నిన్న వచ్చిన నేతలు ఆశ్చర్యపోతున్నారని ఆయన వెల్లడించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చెయ్యాలి
ఆయన ఏం చేసినా ఒక పక్కా వ్యూహం ఉంటుంది. ఇవాళ దేశంలో రాజకీయ శూన్యత ఉందని… ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడ్ కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ముక్కలవుతుందన్న ఆయన.. రాహుల్ యాత్ర చేస్తుంటే గోవాలో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారన్నారు. తెలంగాణలో ఎన్ని రోజులైనా యాత్ర చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితి రాహుల్ గాంధీకి అర్థం అవుతుందన్నారు.కాంగ్రెస్ అస్తిత్వ పోరాటం చేస్తోందన్న ఆయన… రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నప్పుడే తెలంగాణ ఎంపీలు ఆ పార్టీని వదిలిపెట్టే అవకాశం ఉందన్నారు. వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ ఉంటుందన్న నమ్మకం లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు ఓడిపోయాడు… అలాంటి పార్టీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అన్నారు. తెలంగాణలో ఒకరిద్దరు ఎంపీలు కాంగ్రెస్‌ను విడిచిపోతారని వింటున్నానన్నారు. కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయింది. రాజకీయ శూన్యత ఈ దేశ రాజకీయాల్లో ఉందన్నారు.
మునుగొడు ఉపఎన్నికలపై కేటీఆర్
22 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ రాజగోపాల్ కంపెనీకి ఇచ్చిన తరువాతనే సుశీ ఇన్ప్రాకి అందులో మిగిలే పైసల కోసమే రాజగోపాల్ తన పదవిని పణంగా పెట్టి బీజేపీలోకి పోయారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అమిత్ షాను కలిసిన ఓ పెద్దమనిషి తనను కలిశారన్నారు. రాజగోపాల్ 500 కోట్లు ఖర్చు పెడతానని అమిత్ షా చెప్పినట్లు ఆయన తనకు వెల్లడించినట్లు కేటీఆర్ తెలిపారు. ఓటుకు 30 వేలు ఇచ్చి అయిన గెలుస్తా అని రాజగోపాల్ రెడ్డి చెపుతున్నారని కేటీఆర్ చెప్పారు. కాంట్రాక్టర్ బలుపుకు మునుగోడు ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇదన్నారు. 30 శాతం ఓట్లు తమకు ఎక్కువ ఉన్నయన్నారు. టీఆర్ఎస్ మునుగోడులో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇతర అంశాలపై కేటీఆర్
హిందూ ముస్లీం పోలరైజేషన్ చిచోరా చిల్లర్ మాటలు మోహన్ భగవత్‌వి అంటూ వాటిని పట్టించుకోమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ దేశ భవిష్యత్తు యువతదేనన్నారు. ఒక్క ఎన్నిక గెలవని మోహన్ భగవత్ ను కౌన్సిలర్‌గా గెలవమని చెప్పండి చూద్దామన్నారు. 2014లో ముఖ్యమంత్రిగా మోడీ దేశవ్యాప్తంగా 100 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని.చ. కేసీఆర్ కూడా అంతేనన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారన్నారు.