Solar Eclipse 2026: ఈ ఏడాదిలో తొలి సూర్య గ్రహణం రేపే.. ఏ సమయం..? ఎక్కడ కనిపిస్తుంది..?.. పరిహారం ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solar Eclipse 2026: 2025కు గుడ్‌బై చెప్పి.. 2026లో అడుగుపెట్టాం.. ప్రస్తుతం ఫిబ్రవరిలో ఉన్నాం.. అయితే ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న అంటే.. రేపే ఫాల్గుణ అమావాస్య రోజున ఈ సూర్యగ్రహణం సంభవించనుంది. చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యకు వచ్చి సూర్యకిరణాలను భూమికి పూర్తిగా చేరకుండా అడ్డుకోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో పగటిపూట కొద్దిసేపు చీకటి వాతావరణం కనిపిస్తుంది.
అయితే, హిందూ సంప్రదాయంలో సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయాన్ని శుభకార్యాలకు అనుకూలంగా పరిగణించరు. అయితే జపం, ధ్యానం, దానం వంటి ఆధ్యాత్మిక చర్యలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు.
Also Read
- Dhanteras 2026: బంగారం, వెండి కొనలేకపోతున్నారా? ధంతేరస్ రోజు బడ్జెట్లో ఈ 8 వస్తువులు శుభప్రదం
- Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?
- Today Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఏ రాశి వారికి ధనలాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
- Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
సూర్యగ్రహణం సమయం
– గ్రహణం ప్రారంభం: మధ్యాహ్నం 3:26 గంటలకు
– గ్రహణం ముగింపు: సాయంత్రం 7:57 గంటలకు
– గ్రహణం మొత్తం వ్యవధి: సుమారు 4 గంటల 32 నిమిషాలు
సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది.. ఎక్కడ కనిపించదు..
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో గ్రహణ కాలం వర్తించదు.. 2026 లో మొదటి సూర్యగ్రహణం జింబాబ్వే, దక్షిణాఫ్రికా, జాంబియా, మారిషస్, అర్జెంటీనా, టాంజానియా, చిలీ మరియు ఇతర దక్షిణ అమెరికా దేశాలలో కనిపిస్తుంది. దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల నుండి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం వరకు కూడా ఈ గ్రహణం కనిపించనుంది.. ఇక, భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇతర ఆసియా దేశాలతో పాటు యూరప్, ఉత్తర అమెరికాలోని అనేక ప్రాంతాలు, మధ్య మరియు ఉత్తర ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలో కూడా ఇది కనిపించదు..
సూర్యగ్రహణం సమయంలో చేయాల్సిన పరిహారాలు..
సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం, సూర్యగ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది.ఈ సమయంలో సూర్య దోషాన్ని తొలగించడానికి “ఓం హ్రీం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః” వంటి మంత్రాలను జపించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సూర్య గాయత్రి మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించడం – “ఓం భాస్కరాయ విద్మహే మహాతేజయ ధీమహి తన్నో సూర్య: ప్రచోదయాత్” – చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు..
ఇక, సూర్యగ్రహణం తర్వాత వెంటనే గోధుమలు, బెల్లం, రాగి పాత్రలు మొదలైనవి దానం చేయండి. కుంకుమ లేదా ఎరుపు రంగు దుస్తులు దానం చేయడం వల్ల సూర్య దోషం తొలగిపోతుంది. సూర్యగ్రహణం తర్వాత రెండవ రోజు, సూర్యోదయం సమయంలో, రాగి పాత్ర నుండి సూర్య దేవునికి నీటిని అర్పించి, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి . సూర్యగ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండి, మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి. ధ్యానం చేయండి మరియు పవిత్ర పుస్తకాలను చదవండి. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత, స్నానం చేయండి. ఇంట్లో గంగా జలాన్ని చల్లుకోండి లేదా రాతి ఉప్పు కలిపిన నీటిని ఇంటి అంతటా చల్లుకోండి. మీరు సూర్యగ్రహణం సమయంలో యాత్రకు వెళ్తే హనుమాన్ చలిని పఠించడం మంచిదని సూచిస్తున్నారు.. అయితే, సూర్యగ్రహణం అనేది ఖగోళంలో జరిగే ఓ అద్భుతం.. దానిని చూడాలి.. మూఢ నమ్మకాలను పట్టించుకోవద్దని హేతువాదులు, శాస్త్ర సాంకేతికతను బలంగా నమ్మేవారు చెబుతున్నమాట..
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు..!
-
Hero Xtreme 125R Stealth Edition: 125cc బైక్‌లో తొలిసారిగా TPMS.. Hero Xtreme 125R Stealth Edition లాంచ్, ధర ఎంతంటే?
-
Stephen Miller: మిడ్‌టర్మ్ ఎన్నికల షాక్ తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!