Ind vs SA: మొదటి వన్డే సఫారీలదే.. సంజు శాంసన్ పోరాటం వృథా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs SA: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలి వన్డేలోని సఫారీలు విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాట్‌తో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు 40 ఓవర్లకు 4 వికెట్లను కోల్పోయి 249 పరుగులు చేసి.. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముంగిట నిలిపింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. డేవిడ్ మిల్లర్ (75), హెన్రిచ్ క్లాసెన్ (74) అజేయ అర్ధ సెంచరీలతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఐదో వికెట్ భాగస్వామ్యానికి డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసిన్ 139 పరుగులు జత చేశారు. డికాక్ ఔటైన తర్వాత దూకుడుగా ఆడిన క్లాసెన్ పరుగుల వేగం పెంచాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించినా క్యాచ్‌లను చేజార్చడం టీమ్ఇండియా పాలిట శాపమైంది. ఫలితంగా మిల్లర్, క్లాసెన్‌లకు పలు దఫాలు లైఫ్‌లైన్లు లభించాయి.
Ind vs SA: భారత్ లక్ష్యం 250.. అర్థశతకాలు బాదిన మిల్లర్, క్లాసెన్
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 8 పరుగులకే శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(19), ఇషాన్ కిషన్(20) నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా.. సఫారీ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(50) దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 37 బంతుల్లోనే అర్థశతకం బాది కొంచెం ఒత్తిడిని తగ్గించే యత్నం చేశాడు. కానీ ఎంగిడి బౌలింగ్‌లో వెనుదిరగక తప్పలేదు. వికెట్ కీపర్ సంజు శాంసన్ ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. సంజు శాంసన్ 63 బంతుల్లో 86 పరుగులతో రాణించాడు. శాంసన్‌కు తోడుగా శార్దుల్ ఠాకూర్(33) భారత అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేశాడు. అనంతరం వచ్చిన కుల్‌దీప్ యాదవ్ వెంటనే వెనుదిరిగాడు. ఒకానొక దశలో భారత్ గెలుస్తుందనే ఆశలు చిగురించినా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో విజయం దక్షిణాఫ్రికాను వరించింది. చివరికి దక్షిణాఫ్రికా 9పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి మూడు వికెట్లు, కాగిసో రబాడ 2 వికెట్ల చొప్పున తీయగా.. పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షమ్సి తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!