తన కోరిక మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ విడుదల చేయడానికి కేంద్రం ఒప్పుకుంటే.. టీఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్లే వచ్చిందని గప్పాలు కొట్టుకుంటున్నారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు.
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు పలుమార్లు తనిఖీ నిర్వహించారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలిచేందుకు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత హీటెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఎట్టకేలకు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 357 సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్‌లో అత్యధికంగా రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించడంతో ఆయన యూకే ప్రధాని అయ్యారు.
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే! స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని మోడీకి పోస్ట్ కార్డు రాశారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, బయోకాన్ సంస్థ సీఈవో కిరణ్ మజుందార్ షా భర్త జాన్ షా(73) ప్రాణాలు కోల్పోయారు. ఆయన సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భందా మీడియాతో ముచ్చటించిన గవర్నర్ తమిళిసై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.