ప్రేమ గుడ్డిదని అంటారు. దానికి వయసు, దూరం, పరిధి వంటి వాటితో సంబంధం ఉండదని చాలా మంది డైలాగులు కొడుతుంటారు. ఇది చూస్తే అది అక్షరాల నిజమే అనిపిస్తుంది. ఇద్దరి మధ్య దాదాపు 37 ఏళ్ల వయస్సు తేడా ఉంది. అతనికి 19 ఏళ్లు కాగా.. ఆమెకు 56 ఏళ్లు.. అయినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
16 ఏళ్ల అమ్మాయిని 'ఐటమ్' అని పిలిచిన నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి భారత జట్టు శుభారంభం చేసింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఫుల్ జోష్‌తో ఉండగా.. పాక్ జట్టు చాలా కసిగా ఉంది. భారత్, పాక్ జట్లు మళ్లీ తలబడితే చూడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
కాంగ్రెస్ మాజీ నేత విజయ్ సింగ్ మంకోటియా మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు.
మయన్మార్‌లో విధ్యంసకాండ నడుస్తోంది. అక్కడ సైనిక పాలన అరాచకం సృష్టిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్లే. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుండటంతో వారిని అణచివేసేందురు సైన్యం వైమానిక దాడులకు దిగింది.
ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మల్లికార్జున్ ఖర్గే.. నేడు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ విళయతాండవం చేస్తోంది. సోమవారం రాత్రి బంగ్లాదేశ్‌లోని బరిసాల్ సమీపంలోని టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య సిత్రాంగ్ తీరాన్ని దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటుకుని బంగ్లాదేశ్ తీరాన్ని దాటింది. సిత్రాంగ్ తుఫాన్ కారణంగా దాదాపు 35 మంది చనిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పండగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమిదల పండగ దీపావళి కోలాహలం నెలకొంది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా సంతోషంతో పండుగను జరుపుకుంటున్నారు .
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య దూరం బహిర్గతం అవుతోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.