ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్‌దేవి ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ భగవంతుడి అవతారమని, ఆయన కోరుకున్నంత కాలం ఆయన పదవిలో కొనసాగవచ్చని ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి బుధవారం అన్నారు.
ఓ దొంగ దర్జాగా కారులో గుడికెళ్లి.. దేవుడిని భక్తితో ప్రార్థించి మరీ హుండీని ఎత్తుకెళ్లాడు. ఈ వింత దొంగతనం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. సరిగ్గా దీపావళి రోజు ఈ చోరీ జరిగింది.
టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌లో విజయం ఉత్సాహాన్నిస్తుంటే.. రెట్టించిన ఉత్సాహంతో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. కూన జట్టు నెదర్లాండ్స్‌తో నేడు భారత్ తలపడనుంది.
సూది అవసరం లేకుండానే నోటి ద్వారా తీసుకునే కొవిడ్-19 టీకా పంపిణీని చైనా షురూ చేసింది. చైనాలోని షాంఘై నగరంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా వ్యాక్సిన్ ప్రపంచంలో మొదటిదని చెబుతున్నారు.
టీ20 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ జట్టు ఖంగుతింది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్.. ఇంగ్లండ్ మీద 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్‌లో రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించి మృతికి కారణమైన ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో డెంగీతో చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
బిహార్‌లోని గయా జిల్లాలోని గుర్పా రైల్వే స్టేషన్ సమీపంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. గురువారం ఉదయం ధన్‌బాద్ డివిజన్‌లోని కోడెర్మా, మన్పూర్ రైల్వే సెక్షన్ల మధ్య బొగ్గుతో కూడిన గూడ్స్ రైలుకు చెందిన 53 వ్యాగన్లు బోల్తా పడ్డాయి.
కాంగ్రెస్ కొత్త సారథిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న స సోనియా గాంధీ నుంచి ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.