MLA Arava Sridhar Controversy: రోజుకో వీడియో విడుదల..! జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎక్కడ..?
- తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్..?..
- రోజుకో వీడియో విడుదల చేస్తున్న బాధితురాలు వీణ..
- అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని అరవ శ్రీధర్..
- విజయవాడలోనే ఉంటున్నా... అసెంబ్లీకి దూరం..
- పార్టీ ఆదేశాల మేరకే అసెంబ్లీ దూరంగా శ్రీధర్..?..
- శ్రీధర్ అసెంబ్లీకి వస్తే జనసేన ఇమేజ్‌పై ప్రభావం..?..
- వైసీపీకి అస్త్రంగా మారుతుందని జనసేన భావిస్తోందా..?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Arava Sridhar Controversy: లైంగిక వేధింపుల ఆరోపణలు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బయటకు మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నా… లోలోపల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇది సాధారణ అవినీతి ఆరోపణల వ్యవహారం కాదు. బాధితురాలు వీణ రోజుకో వీడియో రిలీజ్ చేస్తోంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే చేసిన వీడియో కాల్స్‌కు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. సభ జరుగుతున్న వేళ బాత్రూమ్‌కు వెళ్లి వీడియో కాల్స్ చేయడంతోపాటు.. సభలో ఉన్న సమయంలో కూడా వీడియో కాల్స్ చేశాడు అరవ శ్రీధర్.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అరవ శ్రీధర్ హాజరు కావడం లేదు. నియోజకవర్గంలో ఉన్నారా..? అంటే అదీ లేదు. విజయవాడలోనే ఉన్నప్పటికీ అసెంబ్లీ వైపు మాత్రం వెళ్లడంలేదు. పార్టీ ఆదేశాల మేరకే ఆయన సభకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారిన కారణంగా… అసెంబ్లీకి ఆయన హాజరు లేనిపోని వివాదాలకు దారితీసే అవకాశం ఉందని జనసేన భావించినట్టు సమాచారం. అరవ శ్రీధర్ అసెంబ్లీకి వస్తే… పార్టీ ఇమేజ్‌పై ప్రభావం పడుతుందేమోననే ఆందోళన కూడా ఉంది. అరవ శ్రీధర్‌ను కాపాడేందుకు జనసేన ప్రయత్నిస్తోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి వస్తే… అతడిపై ఉన్న ఆరోపణలనే వైసీపీ ప్రధాన అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందని భావించి… ముందు జాగ్రత్తగా సభకు దూరంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అయితే… అసెంబ్లీకి దూరంగా ఉండాలని అరవ శ్రీధర్‌కు ఎవరూ చెప్పలేదని… అసెంబ్లీకి రాకుండా పార్టీ అడ్డుకోలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయనే మౌనం పాటిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ వ్యవహారంతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని… ఇది పూర్తిగా ఒక మహిళకు, శ్రీధర్‌కు మధ్య ఉన్న వ్యక్తిగత వ్యవహారమేనని… ఇందులో పార్టీ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు జనసేన త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తోంది. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు అరవ శ్రీధర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు అయ్యాయి. మరోవైపు బాధిత మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతూ నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసే అవకాశం కల్పించాలని వరుసగా వీడియోలు విడుదల చేస్తోంది.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!