Governor Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భందా మీడియాతో ముచ్చటించిన గవర్నర్ తమిళిసై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలో ఉంటుందని గవర్నర్ అన్నారు. గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయన్నారు. గవర్నర్‌గా తనకు ఉన్న పరిధికి లోబడే నడుచుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
Bandi Sanjay: జీఎస్టీ పెంచాలన్నది కేటీఆరే..! కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్
పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరలోనే పరీశీలించి నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తమిళిసై చెప్పారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్‌కు తన బాధ్యతలను ఎరిగి నిర్ణయాలు తీసుకుంటానని పేర్కొ్న్నారు. అంతకు దీపావళి వేడుకల్లో భాగంగా గవర్నర్ దంపతులను కలిసేందుకు సామాన్యులు తరలిరాగా..వారిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.