బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. రిషికి 100 మందికి పైగా పార్టీ అభ్యర్థుల మద్ధతు లభించినట్లు ఆయన అనుచరులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.
దళితులపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దళిత యువకుడికి తీవ్రంగా కొట్టి, గుండు కొట్టించి.. ముఖాన్ని నల్లగా మార్చారు. దళితుడు అయినందువల్లే ఇలా చేశారని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
అప్పటివరకు ఉత్సాహంగా ఓ వేదికపై మాట్లాడిన ప్రొఫెసర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. బీహార్‌లోని చప్రా జిల్లాలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ మతపరమైన కార్యక్రమంలో వేదికపై కుప్పకూలి గుండెపోటుతో మరణించారు.
లేబర్ పార్టీ యూకే పార్లమెంటరీ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం లాంగ్‌లిస్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఉదయ్ నాగరాజు చేరారు. లాంగ్‌లిస్టింగ్ అనేది వడపోత ప్రక్రియ, ఇక్కడ సాధారణంగా వందలాది అప్లికేషన్‌ల నుంచి ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఎంపిక చేయబడతారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధికారిక నివాసంలో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కమలా హారిస్ తమ భర్తతో కలిసి వాషింగ్టన్‌లోని తమ నివాసంలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు.
కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా భార్య మృతదేహాన్ని ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు.
సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే.. మరో ఆలోచన లేకుండా తీసుకుని మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోతుంటారు. అలాంటిది డబ్బుల వర్షం కురిస్తే ఎవరైనా ఊరుకుంటారా?. అలాంటి ఘటనే చిలీ దేశంలో జరిగింది.
శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతూ.. ప్రజల ఇబ్బందులను పెంచుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి శ్రీలంక ప్రజలు ఎప్పుడూ చూడని అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(isro) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అర్థరాత్రి బాహుబలి రాకెట్ జీఎస్‌ఎల్వీ-మార్క్ 3 (ఎల్వీ-ఎం3)ను ప్రయోగించనుంది.