Himachal Pradesh Polls: కాంగ్రెస్ మాజీ నేత విజయ్ సింగ్ మంకోటియా మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిటైర్డ్ మేజర్ విజయ్ సింగ్ మంకోటియా మంగళవారం (అక్టోబర్ 25) మరోసారి కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంకోటియాను కాషాయ పార్టీలో స్వాగతిస్తూ, కాంగ్రెస్‌ను వీడి బీజేపీకి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ప్రముఖ రాజకీయవేత్త, మాజీ కాంగ్రెస్ నాయకుడు మేజర్ విజయ్ సింగ్ మంకోటియా రెండుసార్లు కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. నవంబర్ 12న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంగళవారం మకోటియా బీజేపీలో చేరారు. రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన మంకోటియా మూడోసారి కాంగ్రెస్‌ను వీడి బీజెపిలో చేరారు, మంకోటియా వరుసగా నాలుగు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. ఒక సారి ఇండిపెండెంట్‌గా, రెండుసార్లు కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచారు. అప్పటి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను తొలగించాలని కోరినందుకు జూలై 2017లో హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి నుండి అనాలోచితంగా తొలగించబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో, రాష్ట్ర పరిశ్రమల శాఖకు చెందిన సీనియర్ అధికారిని లంచం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎలా పట్టుకుంది, ముఖ్యమంత్రి కార్యాలయంతో ఆరోపించిన సంబంధాల గురించి అంతా పబ్లిక్ డొమైన్‌లో ఉందని మంకోటియా చెప్పారు.
Mallikarjun Kharge: నేడు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న మల్లిఖార్జున ఖర్గే
2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాపూర్ నుంచి తన బద్ధ ప్రత్యర్థి సర్వీన్ చౌదరి నుంచి ఓడిపోయిన మంకోటియాను 2014లో ముఖ్యమంత్రి టూరిజం బోర్డు వైస్ ఛైర్మన్‌గా నియమించారు. కాంగ్రా నుంచి సీటు లభించకపోవడంతో అసంతృప్తి చెందిన మాజీ శాసనసభ్యుడు జూలై 2007లో బీఎస్పీలో చేరారు. రాష్ట్ర నాయకులను, పార్టీ హైకమాండ్‌ను విమర్శించినందుకు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. వీరభద్ర సింగ్, అతని భార్య ప్రతిభ, మాజీ బ్యూరోక్రాట్ మధ్య జరిగిన ద్రవ్య లావాదేవీల టెలిఫోనిక్ సంభాషణకు సంబంధి చాలా హైప్ చేయబడిన ఆడియో సీడీని ఆయన విడుదల చేశారు. ముఖ్యంగా వీరభద్ర సింగ్‌కు సన్నిహితంగా ఉండే అవినీతికి పాల్పడిన రాష్ట్ర అధికారులు, రాజకీయ నాయకుల జాబితాను కూడా ఆయన విడుదల చేశారు. నవంబర్ 12న ప్రారంభం కానున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. డిసెంబర్ 8న ఆ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు జరగనుంది.