Revanth Reddy: మునుగోడు ఉపఎన్నికల నేపథ్యం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య దూరం బహిర్గతం అవుతోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ భిక్షతోనే ఎదిగిన వాళ్లే వెన్నుపోటు పొడిచారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని టీఆర్‌ఎస్, బీజేపీ చూస్తున్నాయనన్నారు. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలని చూస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఇన్ని కుట్రలు చేస్తున్నారన్నారు. నిఖార్సైన కాంగ్రెస్‌వాదులు మునుగోడుకు కదిలిరావాలని పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్‌లను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా.. రాష్ట్ర పోలీసులు, అధికారులను టీఆర్ఎస్ విచ్చలవిడిగా వాడుకుంటోందని ఆరోపించారు.
Boora Narsaiah Goud: ఈ నెల 26న సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ విడుదల
పవిత్రమైన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడం దీనికి పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు. ఆడబిడ్డ అని చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు తెగబడ్డారన్నారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్ఠులుగా ఉందామా అని ప్రశ్నించారు. తెలంగాణ నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు తరలిరండి. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని పిలుపునిచ్చారు. 60 ఏళ్ల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా కదలి రావాలని… మునుగోడులో కలిసి కదం తొక్కుదామని పిలుపునిచ్చారు.