For calling a girl ‘item’: 16 ఏళ్ల అమ్మాయిని ‘ఐటమ్’ అని పిలిచిన నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అమ్మాయిని “ఐటమ్” అని పిలవడం అవమానకరమని పేర్కొంది. ఇది లైంగిక ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుందని.. ఇది క్షమించరాని నేరమంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో 16 ఏళ్ల బాలిక ఒకరు.. 25 ఏళ్ల యువకుడు తనను లైంగికంగా వేధించాడని కేసు పెట్టింది. ముంబయి ప్రత్యేక పోక్సో కోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టింది. ఓ అమ్మాయిని యువకుడు ఐటమ్ అంటూ వేధించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక పోక్సో కోర్టు.. నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది.
Chaddi Gang: అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు.. మహిళపై దాడి.. చెడ్డీ గ్యాంగ్ పనేనా..?
జూలై 14, 2015న పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న తనను ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెంబడించాడని.. తన జుట్టు పట్టుకుని లాగుతూ.. ‘ఐటమ్’ అని పిలిచినట్లు బాలిక కోర్టులో తెలిపింది. ‘ఐటమ్’ ( క్యా ఐటెం కిదర్ జా రహీ హో) ఎక్కడికి వెళ్తున్నావు అంటూ పిలిచినట్లు బాలిక కోర్టులో వెల్లడించింది. ఈ విషయంపై విచారించిన ప్రత్యేక పోక్సో కోర్ట అబ్బాయిలు ఉద్దేశపూర్వకంగానే అమ్మాయిలను లైంగికంగా వేధించడానికే అలా పిలుస్తారంటూ పేర్కొంది. ఇలాంటి నేరాలను కఠినంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని.. రోడ్‌సైడ్ రోమియోలకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి నిందితుల విషయంలో కనికరం చూపాల్సిన అవసరం లేదని జస్టిస్ ఎస్‌జే అన్సారీ వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ఇలాంటి నేరాలు, అనాలోచిత ప్రవర్తనను కఠినంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తన 28 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. మహిళలను లైంగిక పద్ధతిలో పిలవడం, వేధించడం భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 354 ప్రకారం నేరమని తెలిపారు.