తమిళనాడులో జరిగిన ఓ ఘటన సంచలనం రేపుతోంది. క్షుద్ర పూజల కోసం ఓ మాంత్రికుడు బాలిక తలను తీసుకెళ్లాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం గ్రామంలో చోటుచేసుకుంది.
ఓ సినీ నిర్మాత తాను వేరే మహిళతో ఉండటాన్ని గుర్తించిన భార్యను కారుతో ఢీకొట్టాడు. సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా వాహనంలో మరో మహిళతో ఉండటాన్ని గమనించిన తన భార్యపైకి తన కారును ఎక్కించపోయాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
అమెరికాలో న్యూయార్క్‌లోని స్టేటన్ ఐల్యాండ్‌లో జరిగిన మిస్ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి.
గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సూపర్-12లో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 205 భారీ స్కోరును చేసింది.
వివాహేతర సంబంధాల కారణంగా ఎన్ని కాపురాలు కూలిపోయాయో అందరికీ తెలుసు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. రెండు నిమిషాల మోజు కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తమ పచ్చని సంసారాల్ని తామే నిప్పు పెట్టేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ కూడా ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని, తన జీవతాన్ని సర్వనాశనం చేసుకుంది.
యూకే నూతన ప్రధానిగా నియమితులైన రిషి సునాక్‌కు ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం శుభాకాంక్షలు చెప్పకుండా దూరంగా ఉన్నారు.
కేరళ నరబలి కేసులో ముగ్గురు నిందితులను తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఎర్నాకులం జిల్లాలోని పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్టు మహ్మద్ షఫీ, భగవల్ సింగ్, లైలాలను పోలీసు కస్టడీకి పంపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై దేవుళ్లు ఫొటోలు ముద్రించాలని చేసిన డిమాండ్స్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంకవ్లీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నితీష్ రాణే దీనిపై భిన్నంగా స్పందించారు.