T20 Worldcup 2022: టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి భారత జట్టు శుభారంభం చేసింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఫుల్ జోష్‌తో ఉండగా.. పాక్ జట్టు చాలా కసిగా ఉంది. భారత్, పాక్ జట్లు మళ్లీ తలబడితే చూడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఈ జట్లు తలబడుతున్నాయంటే కేవలం రెండు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచంలో చాలా మంది ఉత్కంఠగా ఆ మ్యాచ్‌ను తిలకిస్తారు అంటే అతిశయోక్తి లేదు. అలాంటిది ఈ టీ20 ప్రపంచకప్ ఈ జట్లు మళ్లీ తలబడే అవకాశాలు ఉన్నాయా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మళ్లీ తలబడతాయా అంటే ఔననే చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఈ రెండు జట్లు అన్ని కుదిరితే మళ్లీ ఫైనల్లో మాత్రమే తలబడే అవకాశాలున్నాయి. అందుకు ఈ రెండు జట్లు గ్రూప్ మ్యాచ్‌ల్లో అన్నిట్లో గెలిచి పట్టికలో టాప్‌లో ఉండాలి. అనంతరం సెమీస్‌లోనూ ప్రత్యర్థులను ఓడిస్తే ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీ పడే అవకాశాలున్నాయి.
Himachal Pradesh Polls: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి కాంగ్రెస్ మాజీ నేత విజయ్ మంకోటియా
ప్రస్తుతం సూపర్-12 దశలో మ్యాచ్‌లో కొనసాగుతుండగా.. గ్రూప్-బిలో ఉన్న భారత్, పాక్.. అందులోని దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లను ఓడించాల్సి ఉంటుంది. 3-4 మ్యాచ్‌లు గెలిచి మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే.. సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఆపై గ్రూప్-ఎ నుంచి వచ్చిన జట్లతో పోటీ పడతాయి. ఆ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి బలమైన టీమ్‌లు ఉన్నాయి. వీటిల్లో నుంచి సెమీస్‌కు వచ్చిన రెండు జట్లను భారత్, పాక్ ఓడిస్తే.. ఈ రెండు జట్లు మళ్లీ ఫైనల్లో తలపడతాయి. ఈ రెండు మళ్లీ ఫైనల్‌లో తలబడాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.