దేశంపై యుద్ధం చేసినందుకు ఉరిశిక్ష పడిన ఇద్దరు పాకిస్తానీ పౌరులతో సహా నలుగురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులను కలకత్తా హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.
ఇండోనేషియాలోని బాలిలో ఓ ప్రముఖ హోటల్ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గాన్ని కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టనున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇవి దేశభద్రతకు, మతస్వేచ్ఛకు పెనుసవాల్ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వీటిని అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో కృషిచేయాలని సుప్రీం ఆదేశించింది.
మిజోరాంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం స్టోన్ క్వారీ కుప్పకూలింది. కార్మికులు మధ్యాహ్నం అన్నం తిని వచ్చిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది కూలీలతో పాటు హిటాచి డ్రైవర్లు క్వారీ లోపల చిక్కుకుపోయారు.
నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా స్థానంలో భారత్ అవతరించనుందని నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభా మంగళవారం నాటికి 8 బిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లు సోమవారం ఇండోనేషియాలోని బాలిలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. బాలిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.