CJI Justice Chandrachud: జిల్లా న్యాయవ్యవస్థ రూపురేఖలను మార్చాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం అన్నారు. మనం ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నా, అది హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా.. జిల్లా న్యాయవ్యవస్థ అనేది న్యాయ వ్యవస్థకు మూలస్తంభమని గ్రహిస్తే తప్ప ఏమీ మారదని చంద్రచూడ్ అన్నారు.సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తన సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో చంద్రచూడ్ ప్రసంగిస్తూ.. ‘మొదట జిల్లా న్యాయవ్యవస్థ రూపురేఖలు మార్చాలి. జిల్లా జడ్జిలను సబార్డినేట్ జడ్జీలు అని పిలవకూడదని ప్రయత్నం చేస్తున్నాను.” అని ఆయన వెల్లడించారు.
Stone Quarry Collapse: కుప్పకూలిన స్టోన్ క్వారీ.. 8 మంది వలస కూలీలు దుర్మరణం
జిల్లా న్యాయమూర్తులు సబార్డినేట్లు కాదు వారు జిల్లా న్యాయవ్యవస్థకు చెందినవారు. జిల్లా న్యాయవ్యవస్థను ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఎలా చూస్తారు అనే దానిపై మన ఆలోచనలు కూడా మారాలని జిల్లా కోర్టులలోని మౌలిక సదుపాయాలను చూపుతూ ఆయన అన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో ఆత్మగౌరవం ఉందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. జాబితా ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేదిశగా ప్రయత్నించిన మాజీ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్‌ను ఆయన అభినందించారు.