హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్ట్స్ (ఫేజ్-III) కింద రూ.2,410 కోట్లతో 104 లింక్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి దాడితో రైతు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అధికారులకు మొర పెట్టుకోవడంతో పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి గత నెల 6వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.. మంగళవారం తన వెబ్‌సైట్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీని విడుదల చేసింది.
యాపిల్ సహ వ్యవస్థాపకు స్టీవ్ జాబ్స్ ధరించిన చెప్పులను వేలం వేశారు. నిజమేనండి.. 1970ల కాలంలో వాడిన పాత చెప్పులను వేలం వేయగా.. వాటికి భారీ ధరను వెచ్చించి ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు.
తేనెటీగలు మానవ, పర్యావరణ ఆరోగ్యం రెండింటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి తేనెటీగల జీవితకాలం సగానికి తగ్గిందంటే నమ్ముతారా?. నిజమేనండి.. ఇన్ని రోజులు మనిషి జీవితకాలం మాత్రమే తగ్గుతుందని అనుకున్నాం.. కానీ జాబితాలోకి తేనెటీగలు కూడా వచ్చాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న సాయిపవన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తమ ఇష్టాన్ని కాదని కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కన్నకూతురు అన్న విషయాన్ని కూడా మరిచి ఆమెకు కోలుకోలేని గాయాన్ని చేశారు.