గోవా కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తోన్న కేసులో అరెస్టైన కీలక నిందితుడు ఎడ్విన్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. మత్తుమాఫియా మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్‌ను పోలీసులు అరెస్టుచేసి 10రోజులు గడవముందే బెయిల్‌పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా హైదరాబాదీ సొగసరి ఆటగాడు వీవీఎస్ లక్ష్మ ణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే, కేవలం న్యూజిలాండ్ టూర్‌కు మాత్రమే ఆయన హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు.
హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల మోసాలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించే విధంగా చిప్స్ అమర్చిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఈ ప్రత్యేక చిప్‌ల ద్వారా జనాలని మోసం చేస్తున్నారు.
కొరియాలోని డేగులో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లలో భారత్ మరో నాలుగు స్వర్ణ పతకాలను గెలుచుకుంది.
భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన రేటింగ్ పాయింట్లలో క్షీణతను చవిచూశాడు, అయినప్పటికీ బుధవారం విడుదల చేసిన ఐసీసీ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు.
దేశానికి ఓబీసీ ప్రధాని అయితే అందరం సంతోష పడ్డామని.. కానీ 8 ఏళ్లలో ఒక పని కూడా చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. మండల కమిషన్ సిఫార్సు ముందుకు దాటట్లేదని ఆయన అన్నారు.
Artemis 1 Moon Mission: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాసా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మానవ రహిత రాకెట్ ఆర్టెమిస్ -1 ఎట్టకేలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి చంద్రునిపైకి ఆర్టెమిస్ ప్రయాణం సాగింది. షెడ్యూల్ కన్నా ఆలస్యంగా ఉదయం 01:47 గంటలకు ప్రయోగించారు. ఆర్టెమిస్‌కు ఒకదాని వెంట ఒకటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ […]
రాష్ట్రంలో భూములు, భూరికార్డులు కీలకమైనవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. అధికారులు రికార్డులు సరిగా లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.
ఒక్క ఫ్యామిలీతోనే నెట్టుకురావడం గగనమైన ఈ రోజుల్లో ఓ వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకోవడంతో పాటు మరొకరితో సహజీవనం చేయడం చర్చానీయాంశంగా మారింది. చివరకు విషయం కాస్తా ఇద్దరికి తెలియడంతో సీన్ రివర్సైంది.