Stone Quarry Collapse: కుప్పకూలిన స్టోన్ క్వారీ.. 8 మంది వలస కూలీలు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stone Quarry Collapse: మిజోరాంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం స్టోన్ క్వారీ కుప్పకూలింది. కార్మికులు మధ్యాహ్నం అన్నం తిని వచ్చిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది కూలీలతో పాటు హిటాచి డ్రైవర్లు క్వారీ లోపల చిక్కుకుపోయారు. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. నయ్‌థియాల్ జిల్లాలోని మౌదర్హ్ అనే గ్రామంలో ఉన్న ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన క్వారీలో ఈ ఘటన జరిగింది. రాష్ట్ర విపత్తు నివారణ బృందాలతో పాటు సరిహద్దు భద్రతా దళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆపరేషన్ చేపట్టాయి.
World Population: 8 బిలియన్లకు ప్రపంచ జనాభా.. చైనాను అధిగమించనున్న భారత్!
Also Read
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
చిక్కుకున్న ఎనిమిది మంది వలస కూలీల మృతదేహాలను మంగళవారం అధికారులు వెలికితీశారు. చిక్కుకున్న మరో నలుగురు కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. “పోస్టుమార్టం పరీక్ష తర్వాత మృతదేహాలను గుర్తించడం జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. తప్పిపోయిన వారందరినీ కనుగొనే వరకు కొనసాగుతుంది” అని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఒక ప్రకటనలో తెలిపింది.మిజోరాంలో సోమవారం రాతి క్వారీ కూలిపోవడంతో 12 మంది కూలీలు చిక్కుకుపోయారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సహాయం చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. స్టోన్ క్వారీ శిథిలాల్లో చిక్కుకున్న 12 మంది కూలీలు బీహార్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఈ క్వారీలో రెండున్నర ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయి.
Mizoram | Eight bodies recovered so far from site at Maudarh village in Mizoram's Hnahthial district. BSF rescue team was immediately dispatched and arrived as first response unit. NDRF team reached the spot on Tuesday morning, search operation for 4 more on
(Source: BSF) pic.twitter.com/Y7jkXUS3xt
— ANI (@ANI) November 15, 2022
తాజావార్తలు
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!