మెటల్ ఫ్రేమ్ ఫ్లాట్ డిజైన్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో రానున్న Lava Bold N2!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Bold N2: భారత్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava International) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ N2 (Lava Bold N2)ను త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ దేశంలో ఎక్స్‌క్లూజివ్‌గా ‘అమెజాన్’ ద్వారా విక్రయించబడనుంది. అయితే డిస్‌ప్లే సైజు, బ్యాటరీ సామర్థ్యం, ప్రాసెసర్, ధర వంటి కీలక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇటీవలే Lava Bold N2 లాంచ్ పై కంపెనీ టీజర్ విడుదల చేసింది. ఈ బోల్డ్ N2 గ్రే, బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.
AP Assembly 2026: ప్రశ్నోత్తరాలతో హాట్ హాట్ చర్చలు.. మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
Lava Bold N2 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందని టీజ్ చేశారు. చదరపు ఆకారంలోని కెమెరా మాడ్యూల్‌లో ఈ కెమెరాలు అమర్చబడ్డాయి. ఇందులో 13MP ప్రధాన కెమెరా ఉండనుందని కంపెనీ తెలిపింది. దీనికి తోడు LED ఫ్లాష్ కూడా ఉంటుంది. ఫోన్ ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్‌తో వెనుక భాగం ఫ్లాట్ డిజైన్‌లో ఉండగా.. దిగువ ఎడమ వైపున కంపెనీ బ్రాండింగ్ కనిపిస్తుంది. కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఇవ్వబడ్డాయి. వీటితోపాటు ఫోన్‌లో USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, కింది భాగంలో స్పీకర్ గ్రిల్ ఉండనున్నాయి.
ఈ కొత్త మోడల్ గతంలో విడుదలైన లావా బోల్డ్ N1కు అప్డేటెడ్ గా రానుంది. Lava Bold N1ను మే 2025లో భారత మార్కెట్లో రూ. 5,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. ఇందులో 6.75 ఇంచ్ HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, Unisoc 9863A చిప్‌సెట్, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో అది బడ్జెట్ లెవల్ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందింది.
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!