నగరంలో కుక్కకాటు ఘటనలను అరికట్టేందుకు నోయిడా అథారిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం పెట్ పాలసీకి సవరణలు చేసింది.పెంపుడు కుక్క లేదా పిల్లి ఎవరిపైనైనా దాడి చేస్తే వాటి యజమానులకు రూ.10వేల జరిమానా విధించాలని నోయిడా అథారిటీ సీఈఓ రీతు మహేశ్వరి నిర్ణయించారు.
మనిషి పుట్టుక నుంచి చావు దాకా ప్రతీ విషయంలోనూ ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది అంటారు పెద్దలు. కొంతమంది సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తే.. మరికొంత మంది తాము చనిపోయినా అవయవదానంతో నలుగురికి పునర్జన్మ కలిగించే గొప్ప భాగ్యం పొందుతారు.
సంచలన ప్రదర్శనలతో ఆసక్తికరంగా సాగిన 2022 టీ20 ప్రపంచకప్ తుదిపోరుకు ఆసన్నమైంది. టీ20 కొత్త ప్రపంచ ఛాంపియన్ ఎవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీలకు అతీతంగా నాయకుల రాజకీయ భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించే రోజు వచ్చేసింది. నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
సాధారణంగా వాహనాలు, ఆభరణాలు, సెల్‌ఫోన్లు, డబ్బులు, విలువైన వస్తువులు చోరీకి గురవుతుంటాయి. కానీ మహారాష్ట్రలో దొంగలు ఏకంగా సెల్ టవర్‌నే ఎత్తుకెళ్లారు. మీరు చదివింది నిజమే..సెల్‌ఫోన్ కాదు సెల్ టవర్‌నే ఎత్తుకెళ్లిపోయారు.
చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చినట్లే కనిపించినా అప్పుడప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ క్రూజ్ షిప్‌లో 800 కరోనా బాధితులు ఉన్న ఓ క్రూజ్ నౌకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేశారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రంగా హిమాచల్ ప్రదేశ్‌లోని తాషిగ్యాంగ్ రికార్డు నెలకొల్పింది. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో తాషిగ్యాంగ్ ఉంది.