Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టనున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మోడల్ అయేషా ఒమర్‌తో షోయబ్ డేటింగ్ చేస్తున్నాడని విషయం సానియాకు తెలిసిపోవడమే, వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణమైందని నెట్టింట రకరకాల కథనాలు ప్రచారమయ్యాయి. ఇటీవలి కాలంలో సానియా ఇన్‌స్టాలో పెట్టిన కొన్ని పోస్ట్‌లు, షోయబ్ మేనేజర్ విడాకుల విషయాన్ని ధ్రువీకరించాడని వచ్చిన వార్తలు, సానియా-మాలిక్ వివాహ బంధానికి తెరపడినట్లు జరిగిన ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. విడాకుల విషయమై మీర్జా-మాలిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదేమోనని ఇప్పుడిప్పుడే వారిరువురి ఫ్యాన్స్ ఓ కన్ఫర్మేషన్‌కు వస్తున్నారు.
అయితే, ఇంతలోనే మీర్జా-మాలిక్ గురించిన ఓ వార్త అభిమానులను సందేహంలోకి నెట్టేసింది. త్వరలో ఇద్దరు కలిసి పాకిస్తాన్ టీవీలో టాక్‌షో నిర్వహిస్తారని ఓ ఓటీటీ ప్లాట్‌ఫాం ప్రకటించింది. ఈ షోకు ‘మీర్జా మాలిక్ షో’ అని పేరు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా.. తాజాగా సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టిన రోజు కాగా.. ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ వారు జంటగా ఉన్న ఫోటోను షేర్ చేశారు. సానియా తన భర్త షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తుండగా.. అన్నింటికి చెక్ పెడుతూ షోయబ్ పుట్టిన రోజు తెలపడం గమనార్హం. ఇవాళ సానియా తన 36వ పుట్టిన రోజున జరుపుకుంటోంది.
Supreme Court: బలవంతపు మతమార్పిళ్లు దేశభద్రతకే పెనుసవాల్.. కఠిన చర్యలు తీసుకోవాలి..
“పుట్టిన రోజు శుభాకాంక్షలు సానియా మీర్జా. మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరకుంటున్నాను ” అంటూ షోయబ్ కామెంట్ జోడించాడు. కాగా సానియా, షోయబ్ అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్లు ఈమధ్య పాకిస్తాన్, యూఏఈ మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్త ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని షోయబ్ ఓ షోలో సానియాను మోసం చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధం బెడిసికొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వారి నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ విషయంపై ఇప్పటి వరకు ఈ జంట మౌనం పాటించింది.