G20 Summit: ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. బాలిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎయిరిండియా వన్ విమానంలో బాలి చేరుకున్న ఆయనకు ఇండోనేషియా ప్రభుత్వ వర్గాలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. మోదీ గౌరవార్థం ఎయిర్ పోర్టులోనే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఇండోనేషియా ప్రభుత్వ పెద్దలతో పాటు సైనిక ఉన్నతాధికారులు కూడా విచ్చేశారు. అటు బాలిలో భారతీయులు కూడా మోదీకి స్వాగతం పలికారు.
జీ20 సమ్మిట్‌లో ఆహారం, ఇంధన భద్రత- ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి వాటిపై వర్కింగ్ సెషన్స్ జరగనున్నాయి. ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్‌తో పాటు మొత్తం పది దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. యూకే కొత్త ప్రధాని రిషి సునాక్ తో ప్రధాని మోదీ సమావేశంలో యూకే-ఇండియాల ఫ్రీట్రేడ్ డీల్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కోవిడ్-19, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా-ఉక్రెయన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బనం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలపై జీ20 దేశాలు చర్చించనున్నాయి. ఇండోనేషియాలో ఈ నెల 15, 16 తేదీల్లో జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ దేశాధినేతలతో ఈ సందర్భంగా మోదీ సమావేశం కానున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ హాజరవుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీ20 సదస్సుకు హాజరుకావడంలేదు. ఇండోనేషియాలో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు 20 సమావేశాల్లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది జీ20 సమ్మిట్ ఇండియాలో జరగనుంది. ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోదీ లాంఛనప్రాయంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. డిసెంబర్ 1 నుంచి జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుంది. 2023 సెప్టెంబర్ లో జీ 20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
Gujarat Elections: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోడీ ఫొటోను తొలగించండి.. ఈసీకి ఆప్ విజ్ఞప్తి
తన బాలి పర్యటన సందర్భంగా, నవంబర్ 15న జరిగే భారతీయ కమ్యూనిటీ రిసెప్షన్‌లో ప్రధాని మోదీ భారతీయ సమాజం, భారతదేశం, బాలి స్నేహితులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శిఖరాగ్ర సమావేశం ముగింపు అనంతరం ప్రధాని నవంబర్ 16న బాలి నుంచి బయలుదేరుతారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, అమెరికా, బ్రిటన్ జీ 20 సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచంలోని జీడీపీలో జీ 20 దేశాలు 85 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, జనాభాలో మూడింట రెండు వంతులు జీ 20 దేశాల్లోనే ఉన్నారు.
Indonesia | PM Narendra Modi arrives at Apurva Kempisnky hotel, Bali to attend the 17th #G20Summit. He is greeted by the President of Indonesia Joko Widodo. pic.twitter.com/ACNlXQ8xDC
— ANI (@ANI) November 15, 2022
Indonesia | Prime Minister Narendra Modi at Apurva Kempisnky hotel, Bali to attend the 17th #G20Summit.
EAM Dr S Jaishankar, NSA Ajit Doval and G20 Sherpa Amitabh Kant are also here. pic.twitter.com/etdPeNoyPz
— ANI (@ANI) November 15, 2022
Indonesia | US President Joe Biden with Prime Minister Narendra Modi at Apurva Kempisnky hotel, Bali where the leaders will attend the 17th #G20Summit. pic.twitter.com/ennyPvqrtk
— ANI (@ANI) November 15, 2022