శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రోరైలు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌లతో పాటు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) కూడా భాగస్వామ్యం కాబోతోంది.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత మహిళ జట్టును ప్రకటించారు. భారత్‌లోనే జరగనున్న ఈ టీ-20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి రెండోసారి ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇందులో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలో డొనేషన్ల వ్యవహారాలపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ అధినేక కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే అవుతారని ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ అవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిమధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమర రాజా సంస్థ ముందుకొచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. పదేళ్లలో రాష్ట్రంలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టండంతోపాటు 4,500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది.
డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర వివరాలను తెలిపారు. పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరామని ఆమె వెల్లడించారు. నర్సంపేటలో టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని.. దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టారని ఆమె ఆరోపించారు.
టీవల ఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాలు తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, ఎమ్మెల్యేలకు ప్రలోభాల కుంభకోణంలో బీజేపీకి చెందిన నేతలు ఉండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఆసీస్ లెజెండ్.. మూడో రోజు ఆటలో భాగంగా కామెంట్రీ చెబుతూ కుప్పకూలాడు.
నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య బెట్టింగ్ వారి కుటుంబంలో పెనువిషాదాన్ని నింపింది. చెరువులో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదాలని తండ్రీకొడుకులు పందెం కాశారు.