Telangana: తెలంగాణలో అమర రాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమర రాజా సంస్థ ముందుకొచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. పదేళ్లలో రాష్ట్రంలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టండంతోపాటు 4,500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్‌తో పాటు లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం- అమర్‌రాజా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఫైబర్ ఎండీ, సీఈఓ సుజయ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
YS Sharmila: కొట్టినా, చంపినా బెదిరేదిలేదు.. పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల కీలక నిర్ణయం
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు.. ఓ లుక్కేయండి..
- Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న అమర్‌రాజా సంస్థకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు అమరరాజా ముందుకొచ్చిందన్న కేటీఆర్.. అమరరాజా కంపెనీకి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమన్న గల్లా జయదేవ్.. నూతన సాంకేతికతతో బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే 10 ఏళ్లల్లో తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నామని తెలిపారు. తెలంగాణలో మా సంస్థ ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందని జయదేవ్ అన్నారు.
Yet another historic win for Telangana
Amara Raja to setup India's largest Lithium Ion Cell Manufacturing facility till date with an investment of ₹9,500 Cr, further reinforcing Telangana’s position as an ideal destination for EV and Advanced Cell Chemistry (ACC) Manufacturing. pic.twitter.com/z0h5BlwUyz
— KTR (@KTRBRS) December 2, 2022
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు