దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతులు పెట్టుబడులు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వరి రైతులు కూలీల కొరత, కూలీ రేట్లు ఏటా పెంపు, ఇతర ఖర్చులతో తల్లడిల్లిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమస్యలను అధిగమించే దిశగా చైనా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జరుగుతున్న మొదటి వన్డేలో భారత టాపార్డర్ విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ 73 పరుగులతో రాణించడంతో ఇండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 250 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనుండగా.. 13,638 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 68 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 68 పింక్ స్టేషన్లు ఉన్నాయి.
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో భారత్ 48వ స్థానానికి ఎగబాకినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
బంగ్లాదేశ్‌తో డిసెంబర్ 4న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. న్యూజిలాండ్ టూర్‌లో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సీనియర్ త్రయం అంతర్జాతీయ జట్టులోకి తిరిగి వచ్చారు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో జరుగుతున్న ఇంగ్లండ్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టులో రావల్పిండి పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారింది. చారిత్రక టెస్టుగా చెప్పుకుంటూ నిర్జీవమైన పిచ్‌ను ఏర్పాటు చేయడంపై పాకిస్థాన్ అభిమానులు సైతం పాక్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు.
ఢిల్లీలో ఎయిమ్స్ సర్వర్స్ హ్యాకింగ్ వ్యవహారం తేలకముందే.. తమిళనాడులోని మరో ఆస్పత్రి సైబర్ దాడికి గురి కావడం గమనార్హం. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌లోని 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు ప్రముఖ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లు, డేటాబేస్‌లను విక్రయించడానికి ఉపయోగించే టెలిగ్రామ్ ఛానెల్‌లో విక్రయించారు.
భారత నావికాదళం 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా మారుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ నేవీ డే సందర్భంగా శనివారం మీడియాతో వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇటీవలి సంఘటనలు మన భద్రతా అవసరాల కోసం ఇతరులపై ఆధారపడలేమని నిరూపించాయని.. ఆత్మనిర్భర్‌గా ఉండటానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను అందించిందని నేవీ చీఫ్ చెప్పారు.
దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో కేసు వెలుగుచూసింది. మథుర జిల్లాలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 14 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం తర్వాత గొంతు నులిమి హత్య చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. డిసెంబర్ 5న సోమవారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ హేమాహేమీ నాయకులను ప్రచార బరిలోకి దింపాయి.