India Womens squad: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత మహిళ జట్టును ప్రకటించారు. భారత్‌లోనే జరగనున్న ఈ టీ-20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయం కారణంగా పూజా వస్త్రాకర్ ఈ సిరీస్‌కు దూరమైంది. భారత్- ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ డిసెంబర్ 9న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. మొదటి రెండు మ్యాచ్‌లు డీవై పాటిల్ స్టేడియంలో జరగనుండగా.. మరో మూడు మ్యాచ్‌లు సీసీఐ-బ్రబోర్న్ స్టేడియంలో జరగనున్నాయి.
పూజ దూరం కావడంతో ఆ జట్టులో కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి ఎంపికైంది. టీమ్ ఇండియాకు అంజలి శర్వాణి ఎంపిక పట్ల ఆదోని ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కుటుంబసభ్యులకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా.. తల్లి గృహిణి. స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు.. ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో క్రికెట్ వైపు అడుగులు వేసిన అంజలి.. అంచలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది.
Anand Mahindra: సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్.. లోకల్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..
భారత మహిళల జట్టు ఇదే..: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికె), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి సర్వాణి, దేవికా వైద్య, రిచా ఎస్ మేఘన, ఘోష్ (వారం), హర్లీన్ డియోల్.
నెట్ బౌలర్లు: మోనికా పటేల్, అరుంధతి రెడ్డి, ఎస్.బి. పోఖార్కర్, సిమ్రాన్ బహదూర్
ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్‌ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్.