పంజాబీ గాయకుడి హత్యకు ప్రధాన సూత్రధారి అయిన కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల రివార్డును ప్రకటించాలని గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి గురువారం డిమాండ్ చేశారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం తన క్రికెట్ సలహా కమిటీని నియమించినట్లు ప్రకటించింది. త్రిసభ్య కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, శ్రీమతి సులక్షణా నాయక్ ఉన్నారు.
క్కువ ధరలకే ఐఫోన్లు అంటూ జనాలను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు నోయిడా పోలీసులు. నకిలీ ఐఫోన్లు విక్రయిస్తున్న నోయిడా గ్యాంగ్‌లోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రాజధాని ప్రాంతంలో (NCR) తక్కువ ధరకు చైనా తయారు చేసిన డూప్లికేట్ యాపిల్ ఐఫోన్‌లను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను నోయిడా పోలీసులు గురువారం పట్టుకున్నారు.
ఉత్తరాఖండ్‌లో అల్మోరాలోని రాణిఖేత్ తహసీల్‌లో చిరుతపులి దాడి చేయడంతో 58 ఏళ్ల వ్యక్తి మరణించాడు. చిరుతపులి తన ఇంటి దగ్గర నుంచి వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన ఘటన దైన గ్రామంలో చోటుచేసుకుంది.
తన భార్య సునంద పుష్కర్ మృతి కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు 2021లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నగర పోలీసులు గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. థరూర్ తరపు న్యాయవాదికి తన పిటిషన్ కాపీని అందించాలని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాదిని జస్టిస్ డీకే శర్మ కోరారు.
తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ గురువారం ఢిల్లీలో రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో నిర్వహించారు
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్యకుమారి పాల్గొన్నారు. నవంబర్ 30న గురజాడ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
లగేజీ ముసుగులో అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న ముఠా ఆట కట్టించారు ఏపీ పోలీసులు. తిరుపతి జిల్లాలో రెండు కోట్లు విలువ చేసే దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీఫక్కీలో 21 కిలోమీటర్లు చేజింగ్ చేసి 44 మంది కూలీలను అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన తొలిదశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియగా.. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగియనుంది.