Next CM KTR Flexies: కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్.. కూకట్‌పల్లిలో ఫ్లెక్సీల హల్‌చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Next CM KTR Flexies: టీఆర్‌ఎస్ పార్టీ అధినేక కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే అవుతారని ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఆ పార్టీ ప్రకటనతో మంత్రి కేటీఆర్ నెక్స్ట్ సీఎం అవడం లాంఛనమైనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ నేతలంతా గొంతెత్తి చాటుతున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కేటీఆర్‌కు కాబోయే సీఎం కేటీఆర్‌కు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు స్వాగతం చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.
Revanth Reddy: మా మధ్య ఉన్నది తోడి కోడళ్ల పంచాయతీ.. ఎన్నో అనుకుంటాం ఆపై కలిసిపోతాం..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
తాజాగా కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ.. టీఆర్ఎస్ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు స్వాగతం అంటూ కొందరు నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. కొన్ని నెలల క్రితం ఈ తరహాలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇందుకు ముగింపు పడింది. తిరిగి మళ్లీ ఇప్పుడు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు నగరంలో సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అయితే, కేటీఆర్ మాత్రం కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉంటారని చెబుతున్నారు. అయితే, టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతారని భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!