Revanth Reddy: మా మధ్య ఉన్నది తోడి కోడళ్ల పంచాయతీ.. ఎన్నో అనుకుంటాం ఆపై కలిసిపోతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: రేవంత్‌రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ అవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిమధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఇద్దరు నేతలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య కొంతకాలంగా ఎడం పెరిగిన సంగతి తెలిసిందే. తమది తోడికోడళ్ల పంచాయితీ అని… పొద్దున తిట్టుకుంటాం మళ్లీ కలిసిపోతామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు మద్దతిస్తున్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇంకా పదేళ్లు అయ్యాకా… రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అన్నారు. ఇప్పట్లో రేవంత్‌ని పదవి నుంచి దింపడం సాధ్యం కాదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Telangana: తెలంగాణలో అమర రాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడి
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
అయితే మీడియా ఓ అడుగు ముందుకేసి మీలో పెద్దకోడలు ఎవరని ప్రశ్నించగా, ఇప్పుడు కలిశామో లేదో అప్పుడే తామిద్దరి మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నిస్తోందంటూ మీడియాపై రేవంత్ ఛలోక్తి విసిరారు. జగ్గారెడ్డి స్పందిస్తూ, తాను రేవంత్ గురించి చెప్పాలనుకున్నది చెప్పేశానని స్పష్టం చేశారు. ముందొక మాట వెనుక ఒక మాట మాట్లాడే అలవాటు తనకు లేదని, అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడబోనని చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఎన్ని అనుకున్నా తాము కలిసుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి, రేవంత్ నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం ఇద్దరు కలిసి సీఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జగ్గారెడ్డి, కొప్పుల రాజు, సునీల్ తదితర నేతలు హాజరయ్యారు. ధరణి సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. రాబోయే ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!