Ricky ponting: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఆసీస్ లెజెండ్.. మూడో రోజు ఆటలో భాగంగా కామెంట్రీ చెబుతూ కుప్పకూలాడు. వెంటనే పాంటింగ్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. పాంటింగ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ఆసీస్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం అతన్ని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో కామెంట్రీ చెబుతూ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతను ఈ రోజు కామెంట్రీ బాక్స్‌కు దూరమయ్యాడు . శనివారం వస్తాడా? పూర్తిగా ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? అనే విషయంపై క్లారిటీ లేదని ఛానెల్ 7 ఓ ప్రకటనలె వెల్లడించింది.
Sons Betting Kills Father: మద్యం మత్తులో బెట్టింగ్.. తండ్రి చనిపోతుంటే వీడియో తీసిన కొడుకులు
శుక్రవారం లంచ్ సమయంలో కామెంట్రీ చెబుతూ.. ఛాతి వద్ద అన్‌ఈజీగా ఉందని పాంటింగ్ చెప్పాడని.. గుండెలో నొప్పిగా ఉందని పేర్కొనడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని.. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తన సహచరులకు పాంటింగ్ చెప్పినట్లు సమాచారం. ఆరోగ్యం నిలకడగా ఉన్నా కొంత కాలం ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఇక పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న అతని ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ సైతం గుండె పోటుతోనే ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కలవరపాటుకు గురయ్యారు. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.