YS Sharmila: కొట్టినా, చంపినా బెదిరేదిలేదు.. పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర వివరాలను తెలిపారు. పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరామని ఆమె వెల్లడించారు. నర్సంపేటలో టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని.. దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టారని ఆమె ఆరోపించారు. బాధితులను హైదరాబాద్ తీసుకొచ్చారన్నారు. సీఎంను కలవడానికి వెళ్తే… ట్రాఫిక్ ఉల్లంఘన పేరుతో అరెస్ట్ చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పోలీసులను వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే… కేవలం టీఆర్ఎస్ నేతలకే ఫ్రెండ్లీగా ఉంటున్నారని ఆమె మండిపడ్డారు. 4వ తేదీన ఆగిన చోట నుంచే పాదయాత్ర ప్రారంభిస్తున్నామని ఆమె వెల్లడించారు. 14వ తేదీ వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అంతకు ముందు జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. దాడులు చేసినా, కొట్టినా, చంపినా బెదిరేదిలేదు.. ఆపద సమయంలో తనతో ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానన్నారు.
Jagga Reddy: కవిత, బీఎల్ సంతోష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలి..
Also Read
పోలీసుల బాధ్యతలను గుర్థు చేస్తూ… పాదయాత్రకు కోర్టు అనుమతి కాపీని డీజీపీకి అందజేశామన్నారు. తెలంగాణలో తాలిబన్ల రాజ్యం సాగుతోందని ఆమె విమర్శించారు. టీఆర్ఎస్ నాయకుల ముసుగులో ఉన్న గుండాలు.. తాలిబన్లు అంటూ మండిపడ్డారు. పాదయాత్రను ఆపేది లేదంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రజల సమస్యలపై నిలదీస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి… కేసీఆర్ కుటుంబం ఆస్తులను పెంచుకుందని షర్మిల ఆరోపించారు. తన మీద విచారణ వేయండి.. అదే విచారణ వాళ్ల మీద కూడా చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం మళ్ళీ ఏర్పడుతుందని గోబెల్స్ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. బీజేపీని ప్రశ్నిస్తున్నది, నిలదీస్తున్నది కేవలం వైఎస్ షర్మిల మాత్రమేనని.. బీజేపీకి దత్త పుత్రికను కానే కాదని ఆమె చెప్పారు. బయ్యారం గనులకు సంబంధించి తనకు సంబంధం లేదన్నారు. సంక్రాంతి తర్వాత.. తెలంగాణలో బస్సు యాత్ర చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!