కరోనా మహమ్మారి కోరల్లో నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు భయాందోళనలను కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌వో గుడ్‌న్యూస్ చెప్పింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ జనాభాలో 90 శాతం మందిలో కొంత మేర రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నారని అంచనా వేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రకు హాజరైనందుకు పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులే అత్యంత ముఖ్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. గుజరాత్‌లోని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థులకు ఇచ్చే మద్దతు గురించి తెలిపారు.
దేశీయ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. బైజూస్, జొమాటో వంటి దేశీయ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. తాజాగా ఓయో కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ టీమ్‌లలో 600 ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనున్నట్లు పేర్కొంది.
సామూహిక హత్యలు జరిగే దేశాల జాబితాలో వరుసగా మూడోసారి పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచినట్లు యూఎస్ థింక్ ట్యాంక్ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తాజాగా అంచనా వేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ద్వారా పెరుగుతున్న హింసతో సహా పలు భద్రత, మానవ హక్కుల సవాళ్లను పాకిస్థాన్ ఎదుర్కొంటుందని ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తన 28 పేజీల నివేదికలో పేర్కొంది.
చైనా జీరో కొవిడ్ విధానంపై ఆ దేశ పౌరుల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో ఆంక్షలు సడలించాలని డ్రాగన్ సర్కారు చూస్తోంది. ఆ దేశం జీరో కొవిడ్ విధానాన్ని సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జీరో-కొవిడ్ పాలసీని ఎత్తేస్తే లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని పరిశోధకులు చెబుతున్నారు.
మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. ఈ ఉదయం మధ్యప్రదేశ్‌లోని మహుదియా నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈరోజు జరిగిన మెగా పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్, అలాగే కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి కూడా పాల్గొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో 160 సీఆర్‌పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి కేవలం వివరణ కోసమే నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
కొలంబియా ఫుట్‌బాల్ జట్టులో విషాదం నెలకొంది. కొలంబియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, అర్జెంటీనా ఫస్ట్ డివిజన్ స్టార్ ఆండ్రెస్ బలంతా(22) శిక్షణలో కుప్పకూలి మరణించాడు.ఇటీవలే అట్లెటికో టుకుమన్ ట్రెయినింగ్ సెషన్‌లో ఆండ్రెస్ పాల్గొన్నాడు.
చదువుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఉన్నత చదువులు చదివి అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. అందుకు కుటుంబ నేపధ్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండి తీరాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో తన ఆశయం, తన కల నేరవేరదేమో అని ఆందోళన చెందుతుంది ఓ అమ్మాయి.