రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు వివక్ష, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్లు, తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలు ప్లే చేయడం లేదా కంటెంట్‌ను ప్రసారం చేయకుండా ఎఫ్ఎం రేడియో ఛానెళ్లను కేంద్రం హెచ్చరించింది.
పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఇవాళ ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లీష్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు మ్యాచ్ తొలిరోజే 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా రికార్టు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి రోజే 4 వికెట్లు కోల్పోయి 506 పరుగుల స్కోర్ చేసి, క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది.
డిసెంబర్ నెలలో 15 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భ్రమణ అధ్యక్ష పదవిని భారతదేశం గురువారం స్వీకరించింది. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పలు ఈవెంట్‌లను భారత్ నిర్వహించనుంది.
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాటల దాడిని రెట్టింపు చేశారు. రాహుల్ గాంధీ తన గడ్డంతో సద్దాం హుస్సేన్ లాగా కనిపిస్తున్నాడని గతంలో చేసిన వ్యాఖ్యను మరో సారి సమర్థించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సహా పలువురు రాష్ట్ర నేతలు యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు.