Jagtial Murder: జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial Murder: అది జగిత్యాల పట్టణం. ఓ వైపు శివరాత్రి.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక హడావుడి. పట్టణంలో ఎక్కడ చూసినా గందరగోళ వాతావరణం ఉంది. ఈ సందట్లో.. నడిరోడ్డుపైనే అత్యంత దారుణంగా ఓ యువకున్ని చంపేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగా జగిత్యాలలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బోరే విశ్వనాథ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. విశ్వనాథ్‌పై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన బోరే విశ్వనాథ్‌కు జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన వివాహితతో ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైంది. ఆమె భర్త గల్ఫ్‌లో ఉండగా సోషల్ మీడియా పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో విశ్వనాథ్ 4 నెలల క్రితం జగిత్యాలలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని మహిళతో సహజీవనం చేస్తున్నాడు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన భర్త.. పిల్లల కోసం భార్యను పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడించాడు. తాను తిరిగి భర్త వద్దకు రానని ఆ మహిళ తెగించి చెప్పేసింది.
భార్య చెప్పిన మాటకు భర్త గంగాధర్ షాకయ్యాడు. కానీ తల్లి లేకుండా పిల్లలు ఇబ్బంది పడుతుండడంతో తల్లడిల్లిపోయాడు. అంతే.. తన భార్యను తీసుకు వెళ్లిన విశ్వనాథ్‌పై కోపం పెంచుకున్నాడు. శివరాత్రి సందర్భంగా విశ్వనాథ్.. సహజీవనం చేస్తున్న మహిళతో బైక్‌పై సారంగాపూర్ మండలంలోని దుబ్బరాజన్న జాతరకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు జగిత్యాలలో వారి కోసం కాపు కాశారు. విశ్వనాథ్ జగిత్యాల బైపాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు అతడిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో విశ్వనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం నిందితుల్లో.. ఓ వ్యక్తి ఆ మహిళ తన భార్య అని చెప్పి.. విశ్వనాథ్‌తో కలిసి ఉంటోందని అన్నాడు. అందుకే హతమార్చానని చెప్పి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. విశ్వనాథ్ తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు గంగాధర్‌తో నాలుగు నెలల క్రితమే విడాకులు అయ్యాయని మహిళ చెబుతోంది. అంతే కాదు గంగాధర్ వేరే పెళ్లి చేసుకున్న తర్వాత.. తాను విశ్వనాథ్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. కానీ ఇలా తన భర్తను చంపేశారని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మొత్తానికి వివాహేతర బంధం కారణంగా .. విశ్వనాథ్ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేస్తోంది.
READ ALSO: Peddi: ‘పెద్ది’ కెప్టెన్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్..
తాజావార్తలు
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?