టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (67) కన్నుమూశారు. నెల రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం పట్ల టీడీపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలను పెంచే చేతులే మొక్కలు నాటితే ప్రకృతి మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు.మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున తమ పిల్లలపై చూపిన ప్రేమానురాగాలతో మహిళా సంఘం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆటతీరును కనబరిచింది.
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ఏపీ సర్కారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వచ్చే అతిథులను ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది.
టీడీపీ రాజకీయం కోసం పరిశ్రమల సదస్సులు నిర్వహించిందని.. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం సమ్మిట్ నిర్వహిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి తమ టార్గెట్ ప్రారంభం అవుతుందన్నారు.
మాటల కంటే చేతలు ముఖ్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నాడు నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మంచి విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు.
ఇరాన్‌లో బుధవారం బాలికల పాఠశాలలపై అనుమానాస్పద గ్యాస్ దాడుల కారణంగా 100 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఇరాన్ అంతటా పాఠశాల విద్యార్థినులలో గత మూడు నెలల్లో వందలాది శ్వాసకోశ బాధల కేసులు నమోదయ్యాయి.
హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ (28) అత్యంత పాశవికంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫ్రిజ్‌లో కాళ్లు కనిపించగా.. తల, మొండెం, చేతుల కోసం పోలీసులు వెతికారు. డాగ్ స్క్వాడ్, డ్రోన్లతోపాటు డ్రైనేజీలో కూడా వెతికారు.