Meenakshi Chowdary : మీనాక్షి చౌదరి.. దశ తిరిగిందిగా.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లక్కీ భామ మీనాక్షి చౌదరి దశ తిరిగింది. ‘ఖిలాడి’, ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ హర్యానా బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది. హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భాగమ్ భాగ్ 2‘ చిత్రంలో హీరోయిన్గా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. 2006లో అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబినేషన్లో వచ్చిన ‘భాగమ్ భాగ్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ను రాజ్ శాండిల్య తెరకెక్కిస్తున్నారు.ఒరిజినల్ మూవీ తరహాలోనే పక్కా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతోంది.
Also Read : Toxic : టాక్సిక్ టీజర్ రిలీజ్.. థియేటర్స్ తగలబడతాయేమో
Also Read
- Raptadu School Attack: "కన్నీళ్లు ఆగడం లేదు".. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
- Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
- Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
- Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
ఈ సినిమాలో మీనాక్షితో పాటు విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండటం విశేషం. అంతేకాకుండా, బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుంది. సీనియర్ నటుడు పరేష్ రావల్ ఈసారి డబుల్ రోల్లో కనిపించబోతున్నారని సమాచారం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షికి, అక్షయ్ కుమార్ వంటి టాప్ స్టార్ పక్కన అవకాశం రావడం ఆమె కెరీర్లో పెద్ద మైలురాయిగా మారనుంది. 2021లో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మీనాక్షి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇప్పుడు హిందీలో కూడా పాగా వేయాలని చూస్తోంది. ‘భాగమ్ భాగ్ 2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే బాలీవుడ్లో మీనాక్షికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
తాజావార్తలు
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!